అంబటి తిరుపతి రాయుడు
తల్లిదండ్రులు:  సాంబశివరావు, విజయలక్ష్మి
స్వస్థలం: గుంటూరు
జననం: 23 వ తేది సోమవారం, సెప్టెంబర్ 1985

1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన అంబటి రాయుడు  క్రికెట్ క్రీడాకారుడు. 2001-02లో రంజీ ట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్‌లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మరియు సెంచరీ పూర్తిచేశాడు. 2005-06 సీజన్‌లో ఒకసారి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున కూడా ఆడినాడు.

రాయుడు 2002లో అండర్-19 భారత క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లాండు పర్యటించి అక్కడ మూడవ వన్డేలో 177 పరుగులు సాధించి 305 పరుగుల పక్ష్యఛేధనలో భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. అంతకు క్రితం మ్యాచ్‌లో 80 పరుగులు సాధించి అందులోనూ భారత జట్టు లక్ష్యసాధనకు తోడ్పడ్డాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు. 2015 ఫిబ్రవరి 14 నుండి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఎంపికైన భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాడు.