అన్నవరం దేవేందర్‌
తల్లిదండ్రులు:   కేదారమ్మ, దశరథం
స్వస్థలం: కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్, పోతారం గ్రామం
జననం: 17 వ తేది బుధవారం, అక్టోబర్ 1962

ఈయన కేదారమ్మ, దశరథం దంపతులకు 1962, అక్టోబర్ 17 న కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జన్మించారు. దశరథం ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

ఉద్యోగం

పంచాయితీరాజ్ శాఖ, జిల్లా ప్రజాపరిషత్, కరీంనగర్ లో సీనియర్ సహాయకులు.

వివాహం

ఏదునూరి రాజేశ్వరి గారితో వివాహం జరిగింది. ఈవిడ ఉపాధ్యాయురాలు. వీరికి ఒక కూతురు (స్వాతి), కుమారుడు (గౌతమ్) ఉన్నారు.

రచయితగా
2001 - తొవ్వ
2002 - మరోకోణం (సామాజిక వ్యాసాలు)
2003 - నడక
2005 - మంకమ్మ తోట లేబర్ అడ్డా
2006 - బుడ్డపర్కలు (నానీలు)
2006 - బొడ్డు మల్లె చెట్టు
2011 - పొద్దు పొడుపు
2014 - పొక్కిలి వాకిళ్ల పులకరింత (కవితా సంకలనం)

సంపాదకత్వం
1997 - మేర మల్లేషం పోరాట పాటలు
2010 - వల్లు బండ (తెలంగాణ ఉద్యమ కరీంనగర్ కవిత్వం)

సంపాదకవర్గ సభ్యుల్లో ఒకరుగా
2001 - సిమాంట (హుస్నాబాద్ కవిగానం)
2006 - శతవసంతాల కరీంనగర్ (1905-2005) మానేరు టైమ్స్ ప్రచురణ
2006 - మా‘నేటి’ కరీంనగర్ (శతవసంతాల ఉత్సవ కమిటి ప్రచురణ
2008 - జానపద గోపురం (డా. గోపు లింగారెడ్డి అభినందన సంచిక
2010 - అక్షర (డా. ఎన్. గోపి షష్టిపూర్తి అభినందన సంచిక
2010 - ‘జాగో...జగావో’ తెలంగాణ ఉద్యమ కవిత్వం
2012 - ‘కరీంనగర్ కవిత’ 2011
2013 - ‘కరీంనగర్ కవిత’ 2012
2013 - ‘నవనీతం’ డా. నతిమెల భాస్కర్ సాహిత్య వివేచన
2013 - ‘ఉడాన్’ తెలంగాణ ఉద్యమ హిందీ అనువాద కవితా సంకలనం
2014 - ‘ఎన్నీల ముచ్చట్లు- 7’ కవితా సంకలనం

పురస్కారాలు - బిరుదులు - గుర్తింపులు
పురస్కారాలు
2001 - మహత్మ జ్యోతిభా పూలే ఫెలోషిప్
2004 - రంజని-కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం
2006 - ఆం.ప్ర. సాంస్కృతిక శాఖ ఉగాది పురస్కారం
2006 - డా. మలయశ్రీ సాహితీ పురస్కారం
2006 - మారసం-రుద్ర రవి స్మారక కవితా పురస్కారం (మంకమ్మ తోట లేబర్ అడ్డా కవితా సంకలనం)
2013 - అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం
2013 - కవయిత్రి మొల్ల పురస్కారం
2013 - తేజ సాహిత్య పురస్కారం
2013 - కలహంస పురస్కారం
2013 - ‘అక్షరశిల్పి’ పురస్కారం (పొద్దుపొడుపు కవితా సంకలనం)
2014 - ముదుగంటి వెంకటనరసింహరెడ్డి సాహిత్య పురస్కారం