అప్పడవేదుల లక్ష్మీనారాయణ
తల్లిదండ్రులు:  వ్యాసులు, మహాలక్ష్మి
స్వస్థలం: తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల
మరణం: 07 వ తేది బుధవారం, మార్చి 1973

ఎ. ఎల్. నారాయణ గా ప్రసిద్ధిచెందిన అప్పడవేదుల లక్ష్మీనారాయణ  B.A., M.A., D.Sc., F.I.P. (b: 1887 - d: 7 మార్చి 1973) భారతదేశానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఇతడు కొడైకెనాల్ లోని సూర్య దర్శిని విభాగపు మొదటి అధ్యక్షుడు.

తొలినాళ్ళు

వీరు 1887 లో అప్పడవేదుల వ్యాసులు మరియు మహాలక్ష్మి దంపతులకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముక్కామల గ్రామంలో జన్మించారు. వీరు కొత్తపేటలోని ఉన్నతపాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్చిచేసారు. తర్వాత శాస్త్రవిజ్ఞానం మీద మక్కువతో రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్ కళాశాలలో చేరి బి.ఎ. పూర్చిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రం లో ఎం.ఎ. 1914 చదివారు. అనంతరం విజయనగరం లోని మహారాజా కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేశారు.

గౌరవ పురస్కారాలు

వీరు లండన్ లోని భౌతికశాస్త్ర సంస్థ ఫెలో (Fellow of the Institute of Physics) గా ఎన్నుకోబడ్డారు.
వీరు భారత జాతీయ సైన్సు అకాడమీ ఫెలో (Fellow of the National Institute of Sciences, India (presently, Indian National Science Academy) గా ఎన్నుకోబడ్డారు.
బెనారస్ లో జరిగిన భారత సైన్సు కాంగ్రెసు యొక్క భౌతికశాస్త్ర విభాగానికి అధ్యక్షత వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ కమిషన్ సభ్యునిగా పనిచేశారు.
వీరు నిర్వహించిన శాస్త్ర పరిశోధనలకు గాను తిరువాన్కూరు మహారాజుగారి కర్జన్ స్మారక బహుమతిని పొందారు.