బెజవాడ గోపాలరెడ్డి
తల్లిదండ్రులు:  పట్టాభిరామిరెడ్డి, సీతమ్మ
స్వస్థలం: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామం
జననం: 07 వ తేది బుధవారం, ఆగస్ట్ 1907
మరణం: 09 వ తేది ఆదివారం, మార్చి 1997

స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి. పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్ కు గవర్నరు గాను మరియు రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు.

జీవిత విశేషాలు

1907 ఆగష్టు 7న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో జన్మించాడు. తండ్రి పట్టాభిరామిరెడ్డి, తల్లి సీతమ్మ. స్వంత ఊరిలోనే కళాశాల చదువు పూర్తి చేసి బందరు జాతీయ కళాశాలలో చేరారు. అక్కడ నుండి శాంతి నికేతన్ లో 1924-27 సం