బోయి భీమన్న
తల్లిదండ్రులు:   నాగమ్మ, పుల్లయ్య
స్వస్థలం: తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు
జననం: 19 వ తేది మంగళవారం, సెప్టెంబర్ 1911
మరణం: 16 వ తేది శుక్రవారం, డిసెంబర్ 2005

బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు.

బాల్యం-విద్యాభ్యాసం

1911 సెప్టెంబరు 19 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో భీమన్న పుట్టాడు. నాగమ్మ మరియు పుల్లయ్య ఇతని తల్లిదండ్రులు. వీరికి పంచపాండవుల వలె ఐదుగురు మగపిల్లలు మరియు ఒక ఆడపిల్ల జన్మించారు. పుల్లయ్య తన మగపిల్లలకు వరుసగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టాడు. భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి. పూర్తి చేశాడు. గుడిసెలు కాలిపోతున్నాయ్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భూమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబర్ 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

ఉద్యోగం

విద్యాభాసం చేసిన తర్వాత బోర్డు హైస్కూలులో చరిత్రను బోధించే ఉపాధ్యాయునిగా పనిచేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ అనువాద విభాగం డైరెక్టర్ గా, రిజిస్ట్రార్ ఆఫ్ బుక్స్ గా 1964 వరకు పనిచేశాడు.

రచయితగా

బోయి భీమన్న ప్రముఖ రచయిత. ఈయన సుమారు 70 పుస్తకాల్ని రాసినట్లు తెలుస్తోంది. పద్య, గేయ, వచన రచనలతో పాటు, నాటకాలను కూడా వ్రాశాడు. వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది. వాటిలో కొన్నేవో కొత్తప్రతిపాదనల్ని, కొత్త సిద్ధాంతాల్నీ చెప్తున్నట్లుంటుంది. ఆకాశవాణి లో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని వ్రాశాడు. వీటన్నింటితో పాటు అంబేడ్కర్‌ వ్రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రాశాడు. వీరు వ్రాసిన ‘జయ జయ జయ అంబేడ్కర!’ దళితులకు జాతీయగేయమై నేటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతోంది.

కవితలు

అనాది కొసనుంచి అనంతతత్త్వంలోకి రాగవైశాఖి రాభీలు (కవితా సంకలనం). గుడిసెలు కూలిపోతున్నై' కవితాసంపుటి 1975 (కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది). భీమన్న ఉగాదులు భీమన్న కావ్యకుసుమాలు మోక్షం నా జన్మహక్కు చివరిమెట్టుమీద శివుడు కూలీ శతకం రాగోదయం అకాండతాండవం గిల్లిచెబుతున్నా మధుబాల దీపసభ

నాటకాలు

పాలేరు, నాటకం - 1938 కూలిరాజు అసూయ ప్రగతి పడిపోతున్న గోడలు రాగవాసిష్ఠం ఆదికవి వాల్మీకి వేదవ్యాసుడు ధర్మవ్యాధుడు బాలయోగి చిత్రకళాప్రదర్శనం (నాటికల సంపుటి) నవజీవన్ పత్రిక చండాలిక (టాగూర్ రచించిన చండాలిక నాటికకు అనువాదము) వచన రచనలు ఏకపద్యోపాఖ్యానం ఇదిగో ఇదీ భగవద్గీత జన్మాంతరవైరం పురాణాలలో హరి-గిరిజన మనీషులు ధర్మం కోసం పోరాటం అంబేద్కరిజం అంబేత్కరమతం

పురస్కారాలు
ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారిచేత కళా ప్రపూర్ణ - 1971
పద్మశ్రీ పురస్కారం - 1973
కాశీవిద్యాపీఠం గౌరవ డాక్టరేట్ - 1976
పద్మ భూషణ్ పురస్కారం - 2001
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ఠ పురస్కారం తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డు - 2004

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మశ్రీ 1973
గౌరవ డాక్టరేట్ కాశీవిద్యాపీఠం 1976
పద్మ భూషణ్ 2001