చిత్తూరు నాగయ్య
తల్లిదండ్రులు:  తండ్రి ఉప్పల ధడియం రామలింగేశ్వర శర్మ
స్వస్థలం: గుంటూరు జిల్లా రేపల్లె
జననం: 28 వ తేది సోమవారం, మార్చి 1904
మరణం: 30 వ తేది ఆదివారం, డిసెంబర్ 1973

చిత్తూరు నాగయ్య (1904 - 1973) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారత దేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది - తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు.

బాల్యము

చిత్తూరు నాగయ్య 1904మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. ఆయన అసలు పేరు "ఉప్పల దడియం నాగయ్య". కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశారు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు.

సినీరంగ ప్రవేశం

1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూర్లో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. 'పాటా పద్యం వచ్చునా - ఓకే!' అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉచ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొని ప్రాచుర్యం పొందాయి. తొలిచిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు.

1939లో బి.యన్.రెడ్డి వందేమాతరం చిత్రంలో నాగయ్యకు కథానాయకుని పాత్ర లభించింది. అదే చిత్రంలో నాగయ్య సంగీతాన్ని కూడా కూర్చారు. అప్పుడు 'హీరో ఇమేజ్' వుంటుందీ, పోతుందీ అన్న భావన లేనేలేదు. వెంటనే 'సుమంగళి (1940) లో వృద్ధపాత్ర ధరించారాయన. తర్వాతి చిత్రం దేవత (1941) లో హీరోయే. ఈ సినిమాలన్నీ తమిళనాడులో కూడా బాగా నడవడంతో, నాగయ్యకు తమిళ చిత్రాల్లో కుడా మంచి అవకాశాలొచ్చాయి. తమిళభాషను ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గ్రాంథికభాష కూడా అలవరుచున్నారు. తన పాటలు తానే పాడుతూ 'సిసలైన తెలుగు సినిమా హీరోగా' గొప్ప వెలుగు వెలిగారు నాగయ్య. స్వర్గసీమ (1945) ఒక ఉదాహరణ. భక్త పోతన (1942), త్యాగయ్య (1946), యోగి వేమన (1947) చిత్రాలు నాగయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ పాత్రల ప్రభావం ఆయన మీద బాగా పడింది.

నటించిన చిత్రాలు

30వ దశకం
గృహలక్ష్మి(1938),  వందేమాతరం (1939)

40వ దశకం

1940
సుమంగళి,
మహాత్మాగాంధీ (డాక్యుమెంటరీ),
విశ్వమోహిని

1941
దేవత

1943
భాగ్యలక్ష్మి,
చెంచులక్ష్మి,
భక్తపోతన

1945
స్వర్గసీమ

1946
త్యాగయ్య,
యోగి వేమన

1949
మనదేశం

50వ దశకం
1950
బీదలపాట్లు

1953
నా ఇల్లు,
ఇన్స్‌పెక్టర్,
ప్రపంచం,
గుమస్తా

1954
మా గోపి,
సంఘం,
జాతకఫలం

1955
అనార్కలి

1956
భక్త మార్కండేయ,
ముద్దు బిడ్డ,
తెనాలి రామకృష్ణ,
నాగపంచమి

1957
సతీ సావిత్రి,
పాండురంగ మహత్యం,
నలదమయంతి

1958
బొమ్మల పెళ్ళి
ఎత్తుకు పైఎత్తు,
గంగా గౌరి సంవాదం,
శ్రీ రామాంజనేయ యుద్దం,
సంపూర్ణ రామాయణం,
పార్వతీ కళ్యాణం

1959
బండరాముడు
జయభేరి
సిపాయి కూతురు

60వ దశకం
1960
అభిమానం
భక్త రఘునాథ్
భక్త శబరి
మా బాబు(అతిధి),
సమాజం,
శాంతినివాసం,
శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం

1961
భక్త జయదేవ
ఇంటికి దీపం ఇల్లాలే
సీతారామ కళ్యాణం
వాగ్దానం(అతిధి)
పెళ్ళిపిలుపు(అతిధి)
సతీ సులోచన(అతిధి)
ఋష్యశృంగ

1962
నాగార్జున
దక్షయజ్ఞం(అతిధి)
ఆరాధన (హీరో నాగేశ్వరరావు తండ్రి)
స్వర్ణమంజరి,
పెళ్ళి తాంబూలం
పదండి ముందుకు(అతిధి)
గాలి మేడలు
సిరిసంపదలు
మమకారం

1963
బందిపోటు
కానిస్టేబుల్ కూతురు
లవకుశ
అనురాగం(అతిధి)
శ్రీకృష్ణార్జున యుద్ధం
తల్లీ బిడ్డలు
లక్షాధికారి,
ఇరుగు పొరుగు

1964
అగ్గిపిడుగు,
ఆత్మబలం
అమరశిల్పి జక్కన
రామదాసు
వివాహ బంధం
గుడిగంటలు
దాగుడుమూతలు(అతిధి),
నవగ్రహ పూజా మహిమ,
బొబ్బిలి యుద్ధం(అతిధి)