చిట్టూరి సత్యనారాయణ
తల్లిదండ్రులు:  సర్వారాయుడు,సుభద్ర
స్వస్థలం: తూర్పు గోదావరి జిల్లా లో పామర్రు
జననం: 06 వ తేది సోమవారం, అక్టోబర్ 1913
మరణం: 19 వ తేది గురువారం, ఏప్రిల్ 2012

చిట్టూరి సత్యనారాయణ (అక్టోబరు 6 1913 - ఏప్రిల్ 19 2012) భారతదేశ ఇ.ఎన్.టి నిపుణులు. ఆయన భారత రాష్త్రపతికి వ్యక్తిగత వైద్యులుగా పనిచేసారు.

జీవిత విశెషాలు

ఈయన తూర్పు గోదావరి జిల్లా లో పామర్రు గ్రామంలో సర్వారాయుడు,సుభద్ర దంపతులకు అక్టోబరు 6 1913 న జన్మించారు. స్కూల్ ఫైనల్ విద్యార్థికా ఉన్నప్పుడే ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నారు. పిడుగు, వీరకేసరి విఖిత పత్రికలను పంపిణీ చేసరు. 1944 లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.ఎస్ పట్టా తీసుకోవడంతో వైద్యునిగా వృత్తి జీవితం ప్రారంభించారు. గొంతు,చెవి,విజ్ఞానంలో ఎం.ఎస్ చేసారు.అమెరికాలో ఎఫ్.ఐ.సి.ఎస్ ,ఎఫ్.సి.సి.పి, ఎఫ్.ఎ.సి.ఎస్. డిగ్రీలను ఇండియన్ అకాడమీ ఆఫ్ మెడిసన్ లో ఎఫ్.ఎ.ఎం.ఎస్. డిగ్రీని అందుకున్నారు. మద్రాసు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా , ప్రొఫెసర్ గా విశిష్ట సేవలను అందించారు. నలుగురు రాష్ట్రపతులకు శస్త్రచికిత్సలు చేసి వారి ప్రసంశలు చూరగొన్నారు.

పరిశోధనలు

తాను నేర్చుకున్న ఆధునిక వైద్యం ప్రాచీన విజ్ఞానంలో నిగూఢ శాస్త్ర సత్యాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని అధర్వణ వేదాన్ని అధ్యయనం చేసారు. వేదపండితుల వద్ద శిక్షణ పొందారు. అధర్వణ వేదం నుండి అనేకానేక గర్బ నిరోధక పద్ధతులను వెలికితీసి, తమ వైద్య శాస్త్ర చరిత్రలో పొందువరిచారు. ప్రాచీన వైద్య విధానాలను మధించారు.

ఇ.ఎన్.టి స్పెషలైజేషన్ గా పలి పరిశోధనలు చేసారు. వివిధ వైద్య పరిశోధక పత్రికలో అనేక పరిసోధన వ్యాసాలు రాసారు. ఎం.జి.రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి కాక ముందు జరిగిన ఒక దాడిలో ఒక తూటా ఆయన కపాలం దిగువన దివువ సైనస్ మార్గాగ్ని అనే చోట చిక్కుకుపోయి, వైద్యులకే సమస్యగా మారింది. క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆయన చాకచక్యంగా జూన్ 12 1967 న ఆ తూటాను తీసేసారు. తన 83 వ యేట గాంధీ శాంతి బృంధం తరపున అమెరికా మొదలగు దేశాలలో రాజాజీ వెంట వెళ్లారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గౌరవ పురస్కారం అందుకున్నారు.టోక్యో లో జపాన్ క్రౌన్ ప్రిన్స్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు.

ఈయన వారసులలో దాదాపు అందరూ వైద్యులే. ఈయన అనేక మంది రాష్ట్రపతులకు వ్యక్తిగత వైద్యులు వైద్య పరిశోధకులు అయిన డాక్టర్ చిట్టూరికి వ్యాధిగ్రస్తుల స్వాంతన చేకూర్చడమే ధ్యేయం. ఆయన 2012 లో మరణించారు.