దేవులపల్లి వేoకట కృష్ణశాస్త్రి
స్వస్థలం: రామచంద్రపాలెం, పిఠాపురం, తూర్పు గోదావరి
జననం: 01 వ తేది సోమవారం, నవంబర్ 1897
మరణం: 24 వ తేది ఆదివారం, ఫిబ్రవరి 1980

దేవులపల్లి కృష్ణశాస్త్రి  (1897-1980) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు.

జీవిత విశేషాలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం గార్లు ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.

 

పురస్కారాలు

1975 - ఆంధ్ర విశ్వవిద్యాలయం - కళాప్రపూర్ణ
1978 -సాహిత్య అకాడమీ అవార్డు
1976 - పద్మ భూషణ్

రచనలు

కృష్ణ పక్షము : ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
ఊర్వశి కావ్యము ,
అమృతవీణ - 1992 - గేయమాలిక
అమూల్యాభిప్రాయాలు - వ్యాసావళి
బహుకాల దర్శనం - నాటికలు,కథలు
ధనుర్దాసు - నాలుగు భక్తీ నాటికలు ,
కృష్ణశాస్త్రి వ్యాసావళి - 4 భాగాలు
మంగళకాహళి - దేశభక్తి గీతాలు
శర్మిష్ఠ - 6 శ్రవ్య (రేడియో) నాటికలు
శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993
మేఘమాల - సినిమా పాటల సంకలనం - 1996
శ్రీ విద్యావతి - శృంగార నాటికలు
యక్షగానాలు - అతిథిశాల - సంగీత రూపకాలు
మహతి
వెండితెర పాటలు - 2008

సినిమా పాటలు

మల్లీశ్వరి తో ప్రారంభించి కృష్ణశాస్త్రి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు. ఉదాహరణకు

సీతామాలక్ష్మి - మావి చిగురు తినగానే కోయిల పలికేనా
మేఘ సందేశం - ఆకులో ఆకునై, పూవులో పూవునై
గోరింటాకు - గోరింట పూచింది కొమ్మ లేకుండా
కార్తీక దీపం - ఆరనీకుమా ఈ దీపం
కృష్ణ పక్షము
మల్లీశ్వరి సినిమా దేశభక్తి గీతం---భారత మాత

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
గౌరవ డాక్టరేట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం - కళాప్రపూర్ణ 1975
కేంద్ర సాహిత్య అకాడమి ఆంధ్ర విశ్వవిద్యాలయం - కళాప్రపూర్ణ 1978
పద్మ భూషణ్ 1976