కాకర్ల సుబ్బారావు
స్వస్థలం: కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామం
జననం: 25 వ తేది ఆదివారం, జనవరి 1925

డా. కాకర్ల సుబ్బారావు (జ.జనవరి 25 1925) ఎమ్.బి.బి.యస్., యమ్.ఎస్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఐ.సి.పి.( FRCR, FACR, FICP,FSASMA, FCCP, FICR, FCGP) రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదు లో నున్న ప్రసిద్ధ ఆసుపత్రి నిమ్స్ పూర్వ డైరెక్టర్

బాల్యం

కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో కాకర్ల సుబ్బారావు వ్యవసాయ కుటుంబంలో జనవరి 25 1925 సంవత్సరంలో జన్మించాడు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో కళాశాల విద్యాభ్యాసం బందరు లోని హిందు కళాశాలలో 1937-1944 సంవత్సరాల మధ్య జరిపాడు. విశాఖపట్టణం ఆంధ్ర వైద్య కళాశాలలో చేరి వైద్య పట్టా ని 1950 సంవత్సరంలో సంపాదించాడు. 1951 సంవత్సరంలో హౌస్‌ సర్జన్సీ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళాడు.

అవార్డులు

సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు మార్చి 17, 2001న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేశారు. ఆయన ఆంగ్లంలో పలికిన పలుకులు "I pass through this life only once, let me do the maximum good to the largest number of people."

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మశ్రీ వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా 2000

వీడియోలు...

కాకర్ల సుబ్బారావు సందేశం

అబ్ధుల్ కాలం జ్ఞాపాకాలతో