ఈడుపుగంటి వెంకట సుబ్బారావు
తల్లిదండ్రులు:  అచ్చన్న మరియు మున్నెమ్మ
జననం: 20 వ తేది గురువారం, డిసెంబర్ 1934
మరణం: 14 వ తేది శనివారం, ఆగస్ట్ 2010

ఈడుపుగంటి వెంకట సుబ్బారావు M.Sc. Ph.D. (డిసెంబర్ 20, 1934 – ఆగష్టు 14, 2010) ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఇతను ఐ.వి.సుబ్బారావుగా సుపరిచితులు. అతను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని పసలపూడి గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు అచ్చన్న మరియు మున్నెమ్మ. అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి అగ్రికల్చర్ లో M.Sc. చేశాడు మరియు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ నుంచి తను Ph.D. పొందాడు. అతను వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టే ముందు విశ్వవిద్యాలయం లో పరిశోధన యొక్క డైరక్టర్ గా ఉన్నారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వరుసగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి 2003 లో పదవీ విరమణ చేశారు.

ఈ విశ్వవిద్యాలయం దేశంలో మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయము దీనిని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తుంది. అతను 2006 లో నిర్వహించిన 93 వ కాంగ్రెస్ కు జనరల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అతను 75 సంవత్సరాల వయస్సులో ఆగష్టు 14, 2010 న క్యాన్సర్ తో మరణించారు.

పురస్కారాలు

అతను వ్యవసాయ రంగానికి చేసిన ప్రముఖ సేవలకు 2002 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మశ్రీ భారత ప్రభుత్వం 2002