ఇందిరా నాథ్
తల్లిదండ్రులు:  ఎన్.వి. రావు
స్వస్థలం: గుంటూరు
జననం: 14 వ తేది శుక్రవారం, జనవరి 1938

ఇందిరా నాథ్ (జ. 14 జనవరి, 1938) సుప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త.

జీవిత విశేషాలు

గుంటూరు లో ఎన్.వి. రావు, లకు జన్మించింది. కొత్తఢిల్లీలోని భారత వైద్య శాస్త్ర సంస్థ లో (AIIMS) 1963లో M.B.B.S, 1969లో M.D పట్టాలు పొందింది. ఇంగ్లాండ్ లో 1983 లో M.R.C.P (Pathology) పట్టా పొందింది.ఆ తర్వాత ఎం.ఎన్.ఎ.ఎమ్‌ . ఎస్. మరియు ఎఫ్.ఎ.సి.ఐ; ఎఫ్.ఎన్.ఎస్.సి డిగ్రీలను కూడా పొందారు.. .

ఉద్యోగాలు

తొలుత లండన్ నగరములోని ఈస్ట్ సఫొల్క్ వైద్యశాలలో (1963-64), తరువాత కార్డిఫ్ నగరములోని వైద్య కళాశాలలో (1964), లండన్ లోని రాష్ట్రీయ హృదయ వైద్యశాలలో (1965) పనిచేసింది. 1965లో సెయింట్ ఆండ్రూస్ వైద్యశాలలో రిజిస్ట్రార్ గా నియమించబడింది. 1967లో స్వదేశము వచ్చి AIIMS లో బయోటెక్నాలజీ విభాగానికి అచార్య పదవి (1967 - 71) చేబట్టారు. సత్యేంద్రనాథ్ బోస్ రీసెర్చ్ సంస్థలోప్రొఫెసర్ గా ఉంటూ (1999) ఎంతో మంచి వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఊతమిచ్చారు.

పరిశోధనలు

వ్యక్తులలో తీవ్ర ఆరోగ్య నష్టాలకు దారితీసే క్లిష్టమైన సమస్యలను కనుగొనడంలో, సునాయాసంగా, ముదస్తుగా కుష్టువ్యాధిని గుర్తించేందుకు రెండు "ఎం లెఫ్రాయ్" ప్రోటీను అన్వేషించి కనుగొనడాంలో ఈమె పరిశోధనలు ఎంతో మార్గదర్శకం వహించాయి. మూడు నుంచి ఆరు వారాల లోపుగానే లెప్రా బాలిల్లి(శరీరమంతా వ్యాపించిన లెప్రొమా కంతులు) ని సూక్ష్మ దర్శిని ద్వారా కనుగొనడాన్ని వివరించారు. వంశపారంపర్యంగా తలెత్తు శోష రస కణముల అసాధారన అభివృద్ధిని, వాటి పనితీరును తన పరిశోధనల ఫలితాల ద్వారా వెల్లడించారు. ఉత్తమ స్థాయి ఔషధాల ద్వారా కూడా సాధించలేని వ్యాధి నివారణకు మూలములను కనుగొన్నారు.. కుష్టువ్యాధి బయల్పడక పూర్వమే, దాని ఆనుపానులను కనుగొని మూలములను నశింపజేయటానికి అవసరమైన చికిత్సలను కనుగొని, మన దేశములో కుష్టువ్యాధి వ్యాపించకుండా ఉండటానికి తమ వంతు కృషి చేసి విజేత కాగలిగారు.

కుష్టు వ్యాధి మీద ఈమె చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధమైనవి. ఈమె ప్రస్తుతం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలోని బయోటెక్నాలజీ విభాగానికి అధిపతిగా ఎస్.ఎన్.బోస్ కేంద్రంలో పరిశోధకులుగా చిరకాలంగా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ నాథ్ కుష్టు వ్యాధి మీదనే కాకుండా మానవులలో వ్యాధి నిరోధక ప్రక్రియ (ఇమ్యునాలజీ) మీద జరిపిన పరిశోధనలు వైద్యంలోను, కొత్తగా వ్యాధులగురించి చేసే పరీక్షలు అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తాయి.

అవార్డులు

1981 : ట్రస్ట్ ఫండ్ ఓరేషన్ అవార్డ్
1983 : శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్
1985 : క్షణీక ఓరేషన్ అవార్డు (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)
1987 : నిత్యానంద ఎండోమెంట్ లెక్చర్
1990 : శ్రీ ఓం ప్రకాశ్ భాసిన్ ఫౌండేషన్ అవార్డు.
1995 : ఇండియన్ కౌన్సిల్
1999 : వ్యాధి నిరోధక శాస్త్రంలో ఈమె జరిపిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించినది.
ఈమెకు మరుగుజ్జు వృక్షాలు (బోన్సాయి మొక్కలు) పెంచటం అన్నా, ఈతకొట్టడం అన్నా చాలా ఇష్టం.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మశ్రీ వ్యాధి నిరోధక శాస్త్రంలో ఈమె జరిపిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించినది. 1999