కనువూరు విష్ణురెడ్డి
స్వస్థలం: నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరు పేట

కనువూరు విష్ణురెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త.ఆయన యిప్పటివరకు 22 బెల్ట్ ఆస్టరాయిడ్సు, ఆరు బైనరీ ఆస్టరాయిడ్స్ ను కనుగొన్నాడు. ఆయన కనుగొన్న 22 ఆస్ట్రాఅయిడ్స్ లో ఒకదాని పేరును "భారత్ 78125" గా నామకరణం చేసారు.ఆయన గౌరవార్థం మార్చి 6, 1981 న ఎస్.జె.బస్ అనే ఖగోళ శాస్త్రవేత్త కనుగొన్న ఒక గ్రహ శకలానికి 8068 విష్ణురెడ్డి గా నామకరణం చేసారు. ఆయన ప్లానటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్టు గా యున్నారు.

జీవిత విశేషాలు

విష్ణురెడ్డి నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరు పేటలోజన్మించారు. ప్రాథమిక విద్యను పూర్తిచేసి మద్రాసులో ఉన్నత విధ్యను కొనసాగించారు. కోయంబత్తూరు విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ తీసుకున్నారు.ఆయన గ్రాండ్ పోర్క్స్ లోని నార్త్ డకోటా విశ్వవిద్యాలయం నుండి ఎర్త్ సిస్టం సైన్స్ లో పి.హెచ్.డి చేసారు. ఆయన "మినరాలోజికల్ సర్వే ఆఫ్ నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్ పాపులేషన్" లో ఈ డాక్టరేట్ ను చేసారు. ఆయన ప్రస్తుతం మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సోలార్ రీసెర్చి ఇన్ జర్మనీ లో పని చేస్తున్నారు.

పరిశోధనలు

ఆయన 1999 నుండి అవిరామంగా గ్రహశకలాకు యావత్తు సమాచారాన్ని వివివ్హ వనరుల ద్వారా సేకరించడం ప్రారంభించి, దాదాపు ఆరువేల పేజీల సమాచారాన్ని ప్రోగుచేసారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఇదే అభిరుచి, జిజ్ఞాస ఉన్న వారితో పరిచయం పెంచుకొనివారి సహాయ సహకారాలతో పరిశోధనలు చేసారు.వేల డాలర్లు ఖరీదు ఉన్న పాత టెలిస్కోప్ కు కూడా కొనలేని ఈయనకు ఇంటర్నెట్ స్నేహితుల స్వంత ఖర్చుతో పంపించారు. ఇంతలో అమెరికా లో అంరర్జాతీయ స్థాయిలో ఖగోళ పరిశోధనలకు సంబందించి వర్క్ షాపులో పాల్గొనడానికి "యాహూ" ఇంటర్నెట్ స్నేహితులు సహాయం అందించగా 2002 ఏప్రిల్ లో వర్క్ షాపులో పాల్గొని ఖగోళ శాస్త్రంలో తనకు తెలియని నూతన గవాక్షాలను ఆవిష్కరించుకున్నారు. ఆయన గ్రహశకలాలు మరియు తోకచుక్కలపై పరిశోధనలు చేసారు.

అమెరికా లోని ఖగోళ శాస్త్రవేత్తల కేంద్రం టెక్సన్ కు కూడా బయలుదేరి వెళ్ళారు. కాంతి కాలుష్యం కూడా లేని రాత్రివేళలు సంవత్సరంలో 300 వరకు లభించే టక్సన్ ప్రాంతంలో ఈయన తన పరిశోధనలు ప్రారంభించారు. తొలి రోజు 2002 జూన్ 28 వ తేదీ పరిశోధనలు ప్రారంభించిన వారం రోజులలో అఖండ విజయాన్ని సాధించిన మాతృదేశ ప్రతిష్టను ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో సుస్థిరం చేసారు.

2002 లో అమెరికా దేశ స్వాతంత్ర్య దినమైన జూలై, 4 వ తేదీన ఒక ఆస్టరాయిడ్ ను ఆయన గుర్తించారు. దానిని అధికార ధృవీకరణ కోసం తన పరిశీలనా పత్రాన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ కు సమర్పించారు. 15 మంది సభ్యులతో కూడిన బృందం వివిధ పరిశీలనలు జరిపి కొత్తగా ఒక గ్రహశకలాన్ని విష్ణు రెడ్డి కనిపెట్టారని 2002, ఆగస్టు 15 న భారత స్వాతంత్ర్యం రోజున ప్రకటించింది.ఈ గ్రహ శకలానికి "భారత్ 78118" గా నామకరణం చేసారు. ఆయన యిప్పటివరకు 22 బెల్ట్ ఆస్టరాయిడ్సు, ఆరు బైనరీ ఆస్టరాయిడ్స్ ను కనుగొన్నాడు.

అవార్డులు
2010 : పెల్లార్ రైడర్ అవార్డు.