కిదాంబి శ్రీకాంత్
తల్లిదండ్రులు:  కేవీఎస్ కృష్ణ, రాధ ముకుంద
స్వస్థలం: గుంటూరులో
జననం: 07 వ తేది ఆదివారం, ఫిబ్రవరి 1993

కిదాంబి శ్రీకాంత్ ఫిబ్రవరి 7, 1993న గుంటూరులో జన్మించాడు. ఇతను ఒక భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు మరియు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇతను ప్రస్తుతం (ఆగస్టు 18, 2014 నాటికి) అంతర్జాతీయ వలయంలో అత్యధిక ర్యాంకు కలిగిన భారత పురుషుల ఆటగాడు. శ్రీకాంత్ గోస్పోర్ట్స్ ఫౌండేషన్, బెంగుళూర్ ద్వారా మరియు 2012 నుండి స్కాలర్షిప్ కార్యక్రమం యొక్క భాగం నుండి తోడ్పాటునందుకొనుచున్నాడు. ఇతను లి-నింగ్ చే కూడా స్పాన్సర్ చేయబడ్డాడు. ఇతను నవంబరు 16, 2014 న, ప్రపంచ బ్యాడ్మింటన్ లో అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరొంది అభిమానులచే "సూపర్ డాన్"గా పిలవబడుతున్న లిన్ డాన్ ను 21-19 21-17 తేడాతో ఓడించి 2014 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ గెలుచుకున్నాడు, ఈ విధంగా సూపర్ సిరీస్ ప్రీమియర్ పురుషుల టైటిల్ ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయునిగా శ్రీకాంత్ పేరుగాంచాడు.

వ్యక్తిగతం

శ్రీకాంత్ నమ్మాళ్వార్ కిదాంబి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కేవీఎస్ కృష్ణ, రాధ ముకుంద. కె.వి.యస్ కృష్ణ ఒక భూస్వామి. శ్రీకాంత్ సోదరుడు నంద గోపాల్ కూడా అంతర్జాతీయ ర్యాంక్ కలిగిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.