కొమ్మారెడ్డి సావిత్రి
తల్లిదండ్రులు:  నిశ్శంకరరావు గురవయ్య, సుభద్రమ్మ
స్వస్థలం: చిర్రావూరు, గుంటూరు జిల్లా
జననం: 06 వ తేది ఆదివారం, డిసెంబర్ 1936
మరణం: 26 వ తేది శనివారం, డిసెంబర్ 1981

తెలుగు సినీ ప్రపంచం లో మహానటి కొమ్మారెడ్డి సావిత్రి (1936 డిసెంబర్ 6 - 1981 డిసెంబర్ 26) . తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించింది.

తొలి జీవితం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 డిసెంబరు 6 న నిశ్శంకరరావు గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి రెండవ సంతానం, 1934లో ఆడపిల్ల పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి ఆరు నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య, సావిత్రికి వరుసకు పెద్దనాన్న. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో చెరారు. పాఠశాలకు వెళ్ళే దారిలో నృత్యవిద్యాలయం ఉండేది. రోజూ ఇతరులు నాట్యం చేయటం చూసి ఆ నృత్యనిలయంలో చేరి శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం మరియూ శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి, అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది.

చలనచిత్ర జీవితం

పెదనాన్న ప్రోద్బలంతో సినిమా రంగం వైపు దృష్టి సారించి ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రి గా విరాజిల్లింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం సినిమాలో చిన్న పాత్ర పొంది, ఆనక ఆ పాత్రకు తగ్గ వయసు లేదని అందులోనుండి తొలగింపబడింది. ఆ తరువాత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. తన నటనా ప్రతిభను నిరూపించుకోవటానికి ఆమె, నృత్యరూపకుడు మరియూ దర్శకుడూ అయిన వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా వరకూ ఆగవలసి వచింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మ లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసింది.

ఆమె సినిమాలు నటిగా

సంసారం (1950) అగ్నిపరీక్ష (1951) పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి పల్లెటూరు (1952)లో సుగుణ ప్రతిజ్ఞ (1953) దేవదాసు (1953)లో పార్వతి బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు మేనరికం (1954) చంద్రహారం (1954)లో చంచల బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా) పరివర్తన (1954)లో సుందరమ్మ వదిన (1955) మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా) మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి అర్ధాంగి (1955) సంతానం (1955)లో శారద కన్యాశుల్కం (1955)లో మధురవాణి దొంగరాముడు (1955)లో సీత చరణదాసి (1956)లో లక్ష్మి భలేరాముడు (1956) అమరదీపం (1956)లో అరుణ వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి తోడికోడళ్ళు (1957)లో సుశీల ఎమ్మెల్యే (M.L.A.) (1957)లో నిర్మల భలే అమ్మాయిలు (1957) మాయాబజార్ (1957)లో శశిరేఖ మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల మాంగల్యబలం (1958) అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి భాగ్యదేవత (1959) నమ్మిన బంటు (1959) అభిమానం (1960) విమల (1960) శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి శాంతినివాసం (1960) దీపావళి (1960) చివరకు మిగిలేది (1960)లో పద్మ పాపపరిహారం (1961) పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ పాండవవనవాసం (1961)లో ద్రౌపది కలసివుంటే కలదుసుఖం (1961) సిరిసంపదలు (1962) పవిత్రప్రేమ (1962) మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా) మంచిమనసులు (1962) ఆరాధన (1962)లో అనూరాధ గుండమ్మ కథ (1962)లో లక్ష్మి రక్తసంబంధం (1962) ఆత్మబంధువు (1962) రక్తతిలకం (1963)లో కమల మూగ మనసులు (1963)లో రాధ కర్ణలో (1963) భానుమతి కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా) చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత నర్తనశాల (1963)లో ద్రౌపది వెలుగునీడలు (1964)లో సుగుణ పూజాఫలం (1964)లో సీత నవరాత్రి (1964) కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా) గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా) డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి దేవత (1964) సుమంగళి (1965) తిరువిలయాదల్(1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది. నాదీ ఆడజన్మే (1965) మనుషులు మమతలు (1965) నవరాత్రి (1966) భక్తపోతన (1966)లో సరస్వతీదేవి ప్రాణమిత్రులు (1967) వరకట్నం (1968) తల్లితండ్రులు (1970)లో కౌసల్య మరోప్రపంచం (1970) అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య జగన్మోహిని (1978) అందరికంటే మొనగాడు (1985) దేవదాసు మళ్లీ పుట్టాడు పూజ రామాయణంలో పిడకలవేట పునాది రాళ్లు గోరింటాకు (చివరి సినిమా)

నిర్మాతగా
ఏక్ చిట్టీ ప్యార్ భరీ(1985) (హిందీ సినిమా)

దర్శకురాలిగా
చిన్నారి పాపలు (1968) కుళందై ఉళ్ళం (1969) ... తమిళ చిత్రం మాతృదేవత (1969) చిరంజీవి (1969) వింత సంసారం (1971) ప్రాప్తం (1971) ... తమిళ చిత్రం