కోనేరు హంపి
తల్లిదండ్రులు:  కోనేరు అశోక్
స్వస్థలం: గుడివాడ
జననం: 31 వ తేది మంగళవారం, మార్చి 1987

1987, మార్చి 31న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించిన కోనేరు హంపి భారతదేశపు ప్రముఖ చదరంగ క్రీడాకారిణి. 2007 అక్టోబర్ లో ఫైడ్ ఎలో రేటింగ్(FIDE Elo rating)లో 2600 పాయింట్లను దాటి మహిళా చదరంగంలో జూడిత్ పోల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిల్చింది. ఈ స్థానం సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి. మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి పిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రికార్డు సృష్టించింది. కేలవం 15 సంవత్సరాల 1 నెల, 27 రోజుల వయస్సులోనే ఈ స్థానానికి ఎదిగింది . 2001 లో హంపి ప్రపంచ జూనియర్ బాలికల చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.

జీవిత విశేషాలు

ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన తండ్రి (కోనేరు అశోక్) ద్వారా హంపికి చదరంగం ఆట పరిచయమైయింది. 1995లో 8 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి నాలుగవ స్థానం కైవసం చేసుకోగానే, అశోక్ తన వృత్తినుండి తొలగి హంపికి పూర్తి స్థాయి శిక్షకుడిగా మారిపోయాడు. ఆ తరువాత 1998లో 10 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి స్వర్ణపతాకం సంపాదించి, వివిధ వాణిజ్య సంస్థలనుండి ఆర్ధిక ప్రోత్సాహకాలను అందుకుంది.

పురస్కారాలు

చదరంగం ఆటలో హంపి చూపించిన విశేష ప్రతిభకు గుర్తింపుగా 2007లో భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.
2003లో చదరంగం ఆటకు ఇచ్చిన అర్జున అవార్డును హంపి కైవసం చేసుకుంది.
2008లో ఈమెకు శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం లభించింది.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
అర్జున 2003
పద్మశ్రీ చదరంగం ఆటలో హంపి చూపించిన విశేష ప్రతిభకు గుర్తింపుగా 2007
రాజా లక్ష్మీ ఫౌండేషన్ 2008