నన్నయ

నివాస ప్రాంతం: రాజమహేంద్రవరం
ఇతర పేర్లు:      నన్నయ భట్టు, నన్నయ భట్టారకుడు
బిరుదులు:      ఆదికవి, శబ్దశాసనుడు, వాగనుశాసనుడు
రచనలు:     మహాభారతంలోని ఆది, సభా పర్వాలు మరియు అరణ్య పర్వంలో 3 అశ్వాసాలు, 142 పద్యాలు

తెలుగులో మహభారతానికి శ్రీకారం చుట్టిన మహనుబావుడు నన్నయ 10వ శతాబ్ద కాలంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జన్మించాడు.ఆతరువాత చాళుక్య ప్రభువైన రాజరాజనరేంద్రుని ఆస్ధానంలో చేరి నరేంద్రుని కోరిక మేరకు పంచమవేదమైన వ్యాసమహభారతాన్ని ఆంద్రీకరణకు పూనుకుని దానిలోని ఆదిసభా పర్వాలను పూర్తిగాను,అరణ్యపర్వం చతుర్ధాశ్వాసంలో 141వ పద్యం వరకూ పూర్తిచేసి పరమపదవించాడు ఆతరువాత నన్నయ వదిలివేయగా ఉన్న భాగాన్ని తిక్కన, ఎఱ్ఱన లు పూర్తిచేసారు.అందుకే ఈ ముగ్గురిని కవిత్రయం అని పిలుస్తారు.

నన్నయకు ఆదికవి,వాగమశాసనుడు అనే బిరుదులు కలవు.తొలిరోజుల్లో తెలుగుభాష స్వరూప స్వభావాలను స్ధిరీకరించి మహభారతంలో ప్రయోగించడం వల్ల ఆయనకు శబ్దశాసనుడు అనే బిరుదు వచ్చింది.నన్నయ భారతాన్ని నైతిక దృష్టిలోనే కాక కావ్యదృష్టితోనూ తెనిగించాడు. పాత్రలు వర్ణణా చాతుర్యంలోనూ,రసపోషణలోనూ నన్నయ శైలీ వైశిష్టం మనకు కనిపిస్తుంది.ప్రసన్నకధాకలితార్ధయుక్తి,అక్షరరమ్యత,నానారుచిరార్ధసూక్తి నిధిత్వం అనేవి నన్నయ కవితా లక్షణాలు.

వీడియోలు...

నన్నయ్య గురించి

నన్నయ్య పద్యాలు