నోరి దత్తాత్రేయుడు
తల్లిదండ్రులు:  సత్యనారాయణ, కనకదుర్గ
స్వస్థలం: కృష్ణా జిల్లా
జననం: 21 వ తేది మంగళవారం, అక్టోబర్ 1947

డా. నోరి దత్తాత్రేయుడు సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు మరియు రేడియేషన్ ఆంకాలజిస్టు.ఇతడు అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు.

తొలినాటి జీవితం

దత్తాత్రేయుడు కృష్ణా జిల్లా లో జన్మించాడు. మచిలీపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి, కర్నూలు వైద్య కళాశాల లో వైద్యశాస్త్రంలో పట్టా పొంది, ఆ తర్వాత ఉస్మానియా వైద్య కళాశాల లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాడు. మహిళలలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడం లొ సిద్ధహస్తులు డా. దత్తాత్రేయుడు నోరి . కొన్నేళ్ళ క్రితం దివంగత ఎన్‌.టి.ఆర్. సతీమణి క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లినపుడు ఆయన చేసిన చిన్న విజ్ఞప్తి హైదరాబాద్ లో " బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్ ఇస్టిట్యూట్ " కు జన్మనిచ్చినది . ఎంతో పేరు ప్రతిస్టలు ఉన్న డా.నోరి సంపాదించినదంతా ' ఆరోగ్య సంపదను ' పెంచడానికి , అభివృద్ధి చెందడానికి వెచ్చించారు ఈ అంతర్జాజీయ ఆణిముత్యము ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కావడం మన అందిరికీ గర్వకారణము .

వైద్యుడిగా

వీరి స్వగ్రామము కృష్ణాజిల్లా లోని మంటాడ . 1947 అక్టోబర్ 21 న జన్మించారు . నాన్న గారు సత్యనారాయణ -టీచరు గా పనిచేసారు . అమ్మ గారు కనకదుర్గ - గృహుణి . వీరిది చాల పేద కుటుంబము . ఈ డాక్తర్ తోబుట్టువులు పది మంది . 5 గురు మగ , 5 గురు ఆడ పిల్లలు . ఇతను అందరికంటే చిన్నవాడు . తను 5 సం.లు వయసున్నప్పుడే నాన్నగారు చనిపోయారు . అమ్మ గారి సంరక్షణలో 7 వ తరగతి వరకూ బందరు లో చదువుకున్నారు . పి.యు.సి , బి.యస్.సి - ఆంధ్ర జాతీయ కళాశాలలోను , 1965 - 1971 వరకు MBBS కర్నూలు వైద్యకళాశాలలోను , 1976 లో ఉష్మానియా మెదికల్ కాలేజీ లో M.D. పూర్తి చేసారు . పెద్దమ్మ జొన్నలగడ్డ సుందరమ్మ గారి సహాయము తో తన చదువంతా సాగింది . నెలనెలా డబ్బులు సాయము చేసేవారు .

ఫిబ్రవరి 1972 నుండి ఫిబ్రవరి 1973 వరకూ గాంధీ ఆసుపత్రి లోపనిచేసారు . 1973 నుండి 1976 వరకు హైదరబాద్ ఉష్మానియా యూనివర్సిటీ కి అనుబంధం గా ఉన్న రేడియం ఇంస్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హూస్పిటల్ లో రెసిడెంట్ గా పనిచేసారు . అనంతరము అమెరికా వెళ్ళారు . ఈతనికి మొదటి నుండీ క్యాన్సర్ వైద్యం లో ఏదో చేయాలని తపన ఉండేది . అందుకే ఈ విభాగములో నూతన విధానాలు కనిపెట్టడానికి కృషిచేసారు . తన కృషిలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా లెక్కచేయకుండా విజయం కోసం తపించారు . అందుకే ఆయన ఈస్థితికి చేరుకున్నారు . క్యాన్సర్ వ్యాధికి సంబంధించి 4 పుస్తకాలు , 200 పైగా పేపర్లు రాసారు .

గౌరవాలు - పురస్కారాలు
1962 లో ప్రీ-యూనివర్సిటీ లో చదివేటపుడు , 1965 లో బి.యస్ .సి చదివేటపుడు , ఉష్మానియాలో ఎం.డి. చేసినపుడు అత్యధిక మార్కులు రావడం తో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు .
1984 లో అమెరికన్‌ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ పెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డ్ ఇచ్చారు . 1990 లో అమెరికన్‌ కాలేజీ ఆఫ్ రేడియేషన్‌ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు . 1994 లో అలుమిని సొసైటీ , మెమోరియల్ స్లాన్‌-కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విష్డ్ అలునినస్ అవార్డ్ అందుకున్నారు.
2000 లో ఇప్పటి వరకు కాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషం వారి అమెరికా బెస్ట్ డాక్టర్ , లేడిస్ హోం జర్నల్ నిర్వహించే సర్వేలో మహిలల క్యాన్సర్ నివారణ లో ఉత్తం డాక్టర్ ఎంపికయ్యారు .
1995 లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ గోల్డ్ మెడల్ అందుకున్నారు .
2003 లో అమెరికన్‌ కాలేజి ఆఫ్ రేడియేషన్‌ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నారు .
బసవతారక క్యాన్స్ ర్ ఇంస్టి్ట్యూట్ నిర్మాణము అప్పటి ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు గారి సహాయ సహకారాలతో జరిగినది . ఎన్‌టీ రామారావు భార్య బసవ తారకంకి క్యాన్సర్ సోకడంతో ఆమెను అమెరికాలో ఉన్నా దత్తాత్రేయుడు దగ్గరకు తీసుకొచ్చారు . చికిత్స జరిగి బాగు అయిన కొన్నాళ్ళు బ్రతికింది. అంతకు ముందే దత్తాత్రేయుడికి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించాలనే ఉద్దేశము ఉండడం ... దానికి తోడు ముఖ్యమంత్రి అడగడం జరిగిన పిమ్మట ప్రభుత్వము 7 ఎకరాల భూమిని హైదరాబాద్ లో ఇవ్వడము , కొంతమంది అమెరికా తెలుగు వారి చందాలతోను , ప్రభుత్వ ఆర్ధిక సాయము తో 200 పడకల ఆసుపత్రి తో అన్ని నూతన వైద్య పరికరాలతో " బసవతారక ఇండో-అమెరికన్‌ కాన్సర్ ఇంస్టిట్యూట్ " నిర్మాణము జరిగి ఫెలోషిప్ కోర్సులను కూడా ప్రారంభమంచడం జరిగింది.

వైద్యసేవలో
డా. నోరి ప్రపంచం లోనే బ్రాకీథిరపీ (brachytherapy) అనే వైద్యప్రక్రియలో అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఇతడు ఈ ప్రక్రియను 1979 నుండి ఉపయోగిస్తూ, వైద్యపరిశోధన మీద దృష్టి యుంచి దీనిని అభివృద్ధిచేసి, ఎందరో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నయం చేశాడు.

పురస్కారాలు
గత 50 సంవత్సరాలలో అమెరికాలోని క్యాన్సర్ వ్యాధులకు అందిస్తున్న ఉన్నత సేవలకు గాను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇతనికి "ట్రిబ్యూట్ టు లైఫ్" అనే గౌరవాన్ని బహూకరించింది.
భారత ప్రభుత్వం ఇతడు అందించిన వైద్యసేవలకు పద్మశ్రీ పురస్కారం 2015 లో ప్రదానం చేసింది.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మశ్రీ భారత ప్రభుత్వం 2015
సంభంధిత వార్తలు