పులపాక సుశీల
తల్లిదండ్రులు:  ముకుందరావు, శేషావతారం
స్వస్థలం: విజయనగరం
జననం: 13 వ తేది బుధవారం, నవంబర్ 1935

పి.సుశీల (పులపాక సుశీల) ప్రముఖ గాయకురాలు. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, తన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ మరియు సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. భాష ఏదయినా అద్భుత కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.

సుశీల 1935లో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది.

పురస్కారములు

భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు (1969 - ఉయిర్ మనిదన్, 1972 - సావలే సమాలి, 1978 - సిరిసిరి మువ్వ, 1983 -మేఘ సందేశం మరియు 1984- ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు) ఎన్నుకోబడింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య పురస్కారం 2001 లో
స్వరాలయ ఏసుదాస్ పురస్కారం 2005 లో
2008 జనవరి 25 న భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో గాన కోకిల పి.సుశీలని సత్కరించింది.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
రఘుపతి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001
పద్మ భూషణ్ 2008 జనవరి 25 న భారత ప్రభుత్వం 2008