పుల్లెల గోపీచంద్
తల్లిదండ్రులు:  పుల్లెల సుభాష్ చంద్ర, సుబ్బారావమ్మ
స్వస్థలం: ప్రకాశం జిల్లా, నాగండ్ల
జననం: 16 వ తేది శుక్రవారం, నవంబర్ 1973

1973 నవంబర్ 16 న ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, నాగండ్లలో జన్మించిన పుల్లెల గోపీచంద్  భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2001 లో చైనాకు చెందిన చెన్‌హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెల్చి ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా నిల్చినాడు. ఇంతకు పూర్వం 1980 లో ఈ ఘనతను ప్రకాష్ పడుకోనె సాధించాడు. గోపీచంద్ సాధించిన అపురూప విజయానికి గుర్తింపుగా 1999లో అర్జున పురస్కారము, 2000-01 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించాయి. కాని ఆ తర్వాత దురదృష్టవశాత్తుతను గాయపడడంతో 2003 లో అతని స్థానం 126 కు పడిపోయింది. 2005 లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గోపీచంద్ పుల్లెల్ల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు. శిష్యురాలు సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ రంగములో తన ప్రతిభను చాటుతున్నది.

జులై 29, 2009న భారత ప్రభుత్వము గోపీచంద్ కు "ద్రోణాచార్య పురస్కారము" ప్రకటించింది. 2014 లో ఈయనకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
ద్రోణాచార్య జులై 29, 2009న భారత ప్రభుత్వము 2009
పద్మ భూషణ్ test 2014