రావు బాలసరస్వతీ దేవి
జననం: 29 వ తేది బుధవారం, ఆగస్ట్ 1928

రావు బాలసరస్వతీ దేవి (జననం: ఆగష్టు 29, 1928) పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికీ సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికీ ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకున్తూనే ఉంది.

1944లో కోలంక జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణను పెళ్ళిచేసుకొని సినిమాలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.

నేపథ్యగాయనిగా

ఇల్లాలు (1940)
భాగ్యలక్ష్మి (1943)
చెంచులక్ష్మి (1943)
మాయా మచ్ఛీంద్ర (1945)
రాధిక (1947)
లైలా మజ్ను (1949)
స్వప్న సుందరి (1950)
పరమానందయ్య శిష్యుల కథ (1950)
షావుకారు (1950)
ఆహుతి (1950)
వాలి సుగ్రీవ (1950)
మాయలమారి (1951)
రూపవతి (1951)
మానవతి (1952)
ప్రియురాలు (1952)
ప్రేమ (1952)
శాంతి (1952)
చిన్నకోడలు (1952)
దేవదాసు (1953)
నా చెల్లెలు (1953)
నా ఇల్లు (1953)
పిచ్చి పుల్లయ్య (1953)
మా గోపి (1954)
వద్దంటే డబ్బు (1954)
జయసింహ (1955)
తెనాలి రామకృష్ణ (1956)
దాంపత్యం (1957)
పెద్దరికాలు (1957)
రాణి రంగమ్మ (1957)
వీరకంకణం (1957)
మంచి మనసుకు మంచి రోజులు (1958)
వచ్చిన కోడలు నచ్చింది (1959)
గాంధారి గర్వభంగం (1959)
పెళ్ళి సందడి (1959)

నటిగా

బాలయోగిని (1936)
అనసూయ (1936)
ఇల్లాలు (1940)
చంద్రహాస (1941)
రాధిక (1947)
సువర్ణమాల (1948)
వాలి సుగ్రీవ (1950)