రావు గోపాలరావు
స్వస్థలం: కాకినాడ సమీపంలోని గంగనపల్లి
జననం: 14 వ తేది గురువారం, జనవరి 1937
మరణం: 13 వ తేది శనివారం, ఆగస్ట్ 1994

రావు గోపాలరావు (జ. 1937 - మ. 1994) తెలుగు సినిమా నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు (1986-1992). ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలల్ను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు. కాకినాడ సమీపంలోని గంగన పల్లిలో 1933లో జన్మించారు.

నట జీవితము

రావు గోపాలరావు నాటకాలను చూసి ఎస్‌.వి.రంగారావు మెచ్చుకుంటూ గుత్తా రామినీడుకి పరిచయం చేస్తే 'భక్తపోతన' చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. 'బంగారు సంకెళ్లు, మూగప్రేమ' చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసి, 'జగత్‌ కిలాడీలు' చిత్రంలో నటించి విలన్‌ అనిపించుకున్నారు. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు నిర్మాతలు. బాపు దర్శకత్వంలో రూపొందిన భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్‌, చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్‌ గుర్తిండిపోతాయి. అలా గుర్తుండి పోయే డైలాగ్స్‌ని, నటనని మగధీరుడు, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్‌ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ళపాటు కొనసాగారు.

13-8-1994న దివంగతులయ్యారు. విలన్‌గా, కామెడీ విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా రాణించిన రావు గోపాలరావు జయంతి జనవరి 14. ఇతనికి 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది. ఈయన కుమారుని పేరు రావు రమేశ్.ఇతను కూడా మంచి నటుడుగా పేరు తెఛ్ఛుకున్నాడు.మగధీర,కొత్త బంగారు లోకం,గమ్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు.  

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
గౌరవ డాక్టరేట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) 1990