శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
తల్లిదండ్రులు:  తండ్రి సాంబమూర్తి
స్వస్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామము
జననం: 04 వ తేది మంగళవారం, జూన్ 1946

పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం(శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు మరియు నటుడు. తెలుగువారు అభిమానముగా బాలు అని పిలిచే ఈయన 1946 జూన్ 4 న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామములో (ప్రస్తుతము ఈ గ్రామము తమిళనాడు రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.

బాల్యము

ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. ఈయన తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథా పండితుడు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసు లో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు.

సినీరంగ ప్రవేశము

బాలసుబ్రహ్మణ్యం 1966 లో నటుడు మరియు నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా రంగప్రవేశము చేశాడు. ఈ చిత్రానికిఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయన పేరే పెట్టుకున్నాడు బాలు.

సినీరంగ ప్రవేశము

బాలసుబ్రహ్మణ్యం 1966 లో నటుడు మరియు నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా రంగప్రవేశము చేశాడు. ఈ చిత్రానికిఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో,అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయన పేరే పెట్టుకున్నాడు బాలు.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
పద్మశ్రీ భారత ప్రభుత్వం 2001
గౌరవ డాక్టరేట్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 1999
పద్మ భూషణ్ 2011