సామర్ల వెంకట రంగారావు
తల్లిదండ్రులు:  లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడు
స్వస్థలం: నూజివీడు, కృష్ణా జిల్లా
జననం: 03 వ తేది బుధవారం, జులై 1918
మరణం: 18 వ తేది గురువారం, జులై 1974

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు.

తొలి జీవితం

కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు.

అవార్డులు, ప్రశంసలు

బిరుదులు:
విశ్వనటచక్రవర్తి
నటసార్వభౌమ
నటసింహ

బహుమతులు
రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం 'చదరంగం' ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం 'బాంధవ్యాలు' తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి.
నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు.
2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది.

కొన్ని పాత్రలు
రంగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్ర ఏదయినా, ఆయన కనిపించేవాడు కాదు, పాత్రే కనిపించేది. ఆయన తన సుదీర్ఘ నట జీవితంలో, అనేకానేక పాత్రలలో జీవించాడు. వాటిలో కొన్ని:

షావుకారు - సున్నం రంగడు
పెళ్ళిచేసి చూడు - ధూపాటి వియ్యన్న
సంతానం - గుడ్డివాడు
మాయాబజార్ - ఘటోత్కచుడు
సతీ సావిత్రి - యముడు
భక్తప్రహ్లాద - హిరణ్యకశిపుడు
శ్రీక్రిష్ణ లీలలు - కంసుడు
యశోద కృష్ణ - కంసుడు
పాండవ వనవాసం - దుర్యోధనుడు
నర్తనశాల - కీచకుడు
హరిశ్చంద్ర - హరిశ్చంద్రుడు
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - బలరాముడు
సంపూర్ణ రామాయణం - రావణుడు
దీపావళి - నరకాసురుడు
అనార్కలి - అక్బర్
మహాకవి కాళిదాసు - భోజరాజు
పాతాళభైరవి - మాంత్రికుడు
భట్టి విక్రమార్క - మాంత్రికుడు
బాలనాగమ్మ - మాంత్రికుడు
విక్రమార్క - మాంత్రికుడు
బంగారుపాప - కోటయ్య
బొబ్బిలియుద్ధం - తాండ్ర పాపారాయుడు