శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి
తల్లిదండ్రులు:  శ్రీరామమూర్తి, సత్యవతి
స్వస్థలం: పల్లపట్ల, రేపల్లె, గుంటూరు జిల్లా
జననం: 23 వ తేది శనివారం, ఏప్రిల్ 1938

ఎస్.జానకి గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి ప్రముఖ భారతీయ నేపధ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు ,తమిళం ,మలయాళం , కన్నడ బాషలలో పాడారు. వివిధ బాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం ,కన్నడ బాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకతించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు మరియు 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొన్ధారు.

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుభ్రమణ్యం తో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొన్దారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొన్దారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు.

జననం మరియు బాల్యం

ఎస్.జానకి  (జ.ఏప్రిల్ 23,1938) దక్షిణభారత నేపథ్యగాయని. గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతామంగేష్కర్‌, పి.సుశీల, జిక్కీ, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవీయం స్టూడియోలో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు మారింది.

ఘంటసాల - ఎస్. జానకి యుగళ గీతాలు

అందాలు చిందే దీపం అల చందమామ - ఋష్యశృంగ - 1961 - రచన: సముద్రాల జూనియర్
అడగవే జాబిల్లి అడగవే అందాల - భూలోకంలో యమలోకం - 1966 - రచన: దాశరధి
అలుకమానవే చిలుకల కొలికిరో - శ్రీ కృష్ణ సత్య - 1971 - రచన: పింగళి
ఆశ నీవు తీర్చుమా ఆవల - మురిపించే మువ్వలు - 1962 (డబ్బింగ్) - రచన: ఆరుద్ర
ఇంగ్లీషులోన మ్యారేజి హిందిలొ - ఆరాధన - 1962 - రచన: ఆరుద్ర
ఇదే వేళ నా వలపు నిన్నే కోరిందీ - వసంతసేన - 1967 - రచన: శ్రీశ్రీ
ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము - ఎం.ఎల్.ఏ - 1957 - రచన: ఆరుద్ర
ఇనాళ్ళు లేని సిగ్గు ఇపుడెందుకే - బంగారు తల్లి - 1971 - రచన: డా. సినారె
ఈ పగలు రేయిగ పండు వెన్నెలగ - సిరిసంపదలు - 1962 - రచన: ఆత్రేయ
ఈ పూలమాలే నీ పాదసేవకు - పూలమాల - 1973 - రచన: వడ్డాది
ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్
ఎందుకూ కవ్వించేదెందుకు - ఆలుమగలు - 1959 - రచన: ఆత్రేయ
ఎనలేని ఆనందమీ రేయీ - పరమానందయ్య శిష్యుల కథ - 1966 - రచన: సదాశివ బ్రహ్మం
ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు - నవగ్రహ పూజా మహిమ - 1964 - రచన: జి. కృష్ణమూర్తి
ఎవ్వరో పిలిచినట్టుటుంది ( ఘంటసాల నవ్వు) - విజయం మనదే - 1970 - రచన: డా. సినారె
ఏడుకొండలవాడా - లవ్ ఇన్ ఆంధ్ర - 1969 - రచన: డా. సినారె
ఏమోఏమో ఇది నాకేమో ఏమో ఐనది - అగ్గిపిడుగు - 1964 - రచన: డా. సినారె
ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావు - పట్టిందల్లా బంగారం - 1971 - రచన: జంపన
ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు - గోపాలుడు భూపాలుడు - 1967 - రచన: ఆరుద్ర
ఓ ఓ మీసమున్న మొనగాడా చెప్ప- భూలోకంలో యమలోకం - 1966 - రచన: దాశరధి
ఓ దారినపోయే చిన్నవాడా ఊరేది పేరేది - మా బాబు - 1960 - రచన: కొసరాజు
ఓరబ్బీ చెబుతాను ఓలమ్మీ చెబుతాను - ఖైదీ బాబాయ్ - 1974 - రచన: డా. సినారె
ఓహో సుందర ప్రకృతిజగతి - పాదుకా పట్టాభిషేకం - 1966 - రచన: వడ్డాది
ఓహో హోహో రైతన్నా - విజయం మనదే - 1970 - రచన: కొసరాజు
కదలించే వేదనలోనే ఉదయించును - సంగీత లక్ష్మి - 1966 - రచన: డా. సినారె
కలల అలలపై తేలెను మనసు - గులేబకావళి కథ - 1962 - రచన: డా. సినారె
కళ్ళళ్ళో నీరెందులకు కలకాలం - కానిస్టేబులు కూతురు - 1963 - రచన: ఆత్రేయ
కాపాడుమా మము దేవా శాపాలనే - భక్త అంబరీష - 1959 - రచన: ఆరుద్ర
కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో - లక్ష్మీ కటాక్షం - 1970 - రచన: కొసరాజు
కుశలమా నీకు ( సంతోషం) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ - 1966 - రచన: పింగళి
కుశలమా నీకు (విషాదం) - శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ - 1966 - రచన: పింగళి
కొండలన్నీ వెదికేను కోనలన్నీ- వసంతసేన - 1967 - రచన: దాశరధి
గత సువిఙ్ఞానప్రకాశమ్ము మరల - లక్ష్మీ కటాక్షం - 1970 - రచన: చిల్లర భావనారాయణ
గాలిలో తేలే పూలడోలలో పన్నీరు చల్లే - కలిమిలేములు - 1962 - రచన: మల్లాది
గున్నమావి కొమ్మన కులికే చిలకమ్మా- పూలమాల - 1973 - రచన: వడ్డాది
గులాబీలు పూచే వేళ కోరికలే పెంచుకో - భలే అబ్బాయిలు - 1969 - రచన: కొసరాజు
చిరునవ్వుల చినవాడే పరువంలో - పవిత్ర హృదయాలు - 1971 - రచన: డా. సినారె
చిలిపి చిలకమ్మ ఆగు నా చేతిలొ ఉయ్యాల - కలిమిలేములు - 1962 - రచన: ఆరుద్ర
చూపుమా నీదయా కురిపించుమా - భక్త అంబరీష - 1959 - రచన: ఆరుద్ర
చూపులు కలసిననాడే నీ రూపం - మా మంచి అక్కయ్య - 1970 - రచన: డా. సినారె
చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు - తాళిబొట్టు - 1970 - రచన: ఆత్రేయ
చెప్పకయే తప్పించుకు పోవకు - పెళ్ళి సంబంధం - 1970 - రచన: కె.వరప్రసాద రావు
జయ గణనాయక విఘ్నవినాయక - నర్తనశాల - 1963 - రచన: సముద్రాల సీనియర్
జూటా మాటల్తొ ఎందుకయ్యా మనకంతా - ఎత్తుకు పైఎత్తు - 1958 - రచన: కొసరాజు
త ధిన్ ధోన ( ధిల్లానా) - ఉమా చండీ గౌరీ శంకరుల కథ - 1968 - సాంప్రదాయం
ధర్మం చెయ్యండి బాబు దానం - వంశోద్ధారకుడు - 1972 - దాశరధి
నడిరేయి ఏ ఝాములో స్వామి - రంగుల రాట్నం - 1967 - రచన: దాశరధి
నాన్నా అనే రెండక్షరాలు మరపురాని - దీక్ష - 1974 - రచన: దాశరధి
నీ ఆశా అడియాస చెయిజారే మణిపూస - ఎం.ఎల్.ఏ - 1957 - రచన: ఆరుద్ర
పందొమ్మిదొందల యాభై మోడల్ - లోగుట్టు పెరుమాళ్ళకెరుక - 1962 - రచన: వీటూరి
పలికేది నేనైనా పలికించేది నీవేలే- పవిత్ర హృదయాలు - 1971 - రచన: డా. సినారె
భువనమోహినీ అవధిలేని యుగయుగాల - భామావిజయం - 1967 - రచన: డా. సినారె
మధురం మధురం ఈ సమయం - కన్నుల పండుగ - 1969 - రచన: రెంటాల గోపాలకృష్ణ
మనసులో మాలిక - మనసు మమత - 0000 - రచన: కె. వసంతరావు
మనిషిని చూశాను ఒక మంచి మనిషిని - తల్లిదండ్రులు - 1970 - రచన: ఆత్రేయ
మమతలలో మధురిమగా - మనసు మమత - 0000 - రచన: ఎలమంచిలి రాంబాబు
మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే - అడుగుజాడలు - 1966 - రచన: డా. సినారె
మీరజాలగలనా నీ ఓ లలనా - మా నాన్న నిర్దోషి - 1970 - రచన: డా. సినారె
మేడలో ఉన్నావా ఓ రాజా వెన్నెల - పట్టిందల్లా బంగారం - 1971 - రచన: డా. సినారె
రెడి రడి రెడీ ఎందుకైన మంచిది - పట్టుకుంటే లక్ష - 1971 - రచన: విజయ రత్నం
లడ్డులడ్డులడ్డు బందరు మిఠాయి లడ్డు - అగ్గిపిడుగు - 1964 - రచన: జి. కృష్ణమూర్తి
శ్రీశైల భవనా! భ్రమరాంబా రమణా - బంగారు పంజరం - 1969 - రచన: దేవులపల్లి
స స స సారె గ గ గ గారె నీవురంగుల - సవతికొడుకు - 1963 - రచన: బైరాగి
సలామాలేకుం సాహెబుగారు - గులేబకావళి కథ - 1962 - రచన: డా. సినారె
సిక్కింది సేతులో కీలుబొమ్మా - ఎత్తుకు పైఎత్తు - 1958 - రచన: కొసరాజు
సిలకవే రంగైన మొలకవే - సంగీత లక్ష్మి - 1966 - రచన: దాశరధి
హిమనగిరీ మధుర (వరూధీనీ ప్రవరాఖ్య) - టైగర్ రాముడు - 1962 - రచన: సముద్రాల జూనియర్

పురస్కారాలు

జాతీయ పురస్కారం
1977 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట: "Senthoora Poove") 16 Vayathinile, తమిళం
1981 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట: "Ettumanoorambalathil") Oppol, మళయాళం
1984 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట : "వెన్నెల్లో గోదారి అందం" ) సితార, తెలుగు
1992 – ఉత్తమ నేపథ్య గాయని – (పాట: "Inji Iduppazhagha") Devar Magan, తమిళం

నంది పురస్కారం
రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు 10 సార్లు అందుకుంది.

ఇతర పురస్కారాలు
1986లో కలైమామణి
1997లో ఫిలింఫేర్‌ దక్షిణ భారత సాహిత్య అవార్డు 2002లో ఎచీవర్‌ అవార్డు
2005లో స్వరాలయ జేసుదాసు ప్రత్యేక పురస్కారం 2009లో గౌరవ డాక్టరేట్‌
2011లో కర్నాటక బసవభూషణ్‌ అవార్డు
2012లో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్‌ అవార్డు
2013లో మా మ్యూజిక్‌ జీవిత సాఫల్య అవార్డు
వీటితోపాటు తమిళనాడు సినీ అవార్డులు 7, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా, కేరళ రాష్ర్ట ఉత్తమ గాయని గా 11 అవార్డులు సాధించింది.
జానకి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా" అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించాడు.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
కళై మామణి 1986
గౌరవ డాక్టరేట్ 2009