శోభన్ బాబు
తల్లిదండ్రులు:   తండ్రి ఉప్పు సూర్యనారాయణ రావు
స్వస్థలం: కృష్ణా జిల్లా చిన నందిగామ
జననం: 14 వ తేది గురువారం, జనవరి 1937

శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (1937-2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించాడు.

బాల్యం

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. జనవరి 14, 1937న ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కృష్ణా జిల్లా చిన నందిగామ ఇతని స్వగ్రామం.. తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం హైస్కూల్లో చదివేరోజుల్లో శోభన్ బాబు నాటకాల పైన ఆసక్తి పెంచుకొని అనతికాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 'పునర్జన్మ' వంటి నాటకాలలో మంచి పేరు సంపాదించుకొన్నాడు. హైస్కూలు చదువు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువు పూర్తి చేసాడు.

ఆణిముత్యాలు

శోభన్ బాబు నటజీవితంలో ఎన్నో చిత్రాలు ఘనవిజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.
మనుషులు మారాలి: యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు నటన అద్వితీయం. ఈ సినిమా అప్పట్లో 25 వారాలు ఆడింది.
చెల్లెలి కాపురం: అప్పటికే అందాల నటుడిగా ఆంధ్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు నట జీవితంలో ఈ చిరం కలికితురాయి. అంద వికారుడయిన రచయితగా చెల్లెలి కోసం తాపత్రయ పడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం.
ధర్మపీఠం దద్దరిల్లింది: తన కన్న కొడుకులు ముగ్గురూ అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురినీ అంతంచేసే తండ్రిగా శోభన్ బాబు ప్రదర్శించిన నటన అసామాన్యం.

అవార్డులు-రివార్డులు

ఫిల్మ్ ఫేర్ అవార్డు: 1971, 1974, 1976, 1979
ఉత్తమ నటుడిగా నంది అవార్డు: 1969, 1971, 1972, 1973, 1976
సినీగోయెర్స్ అవార్డు: 1970,1971,1972,1973,1974,1975,1985,1989
వంశీ బర్కిలీ అవార్డు: 1978, 1984, 1985
కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడు అవార్డు: బంగారు పంజరం సినిమాకు 1970లో

నటించిన సినిమాలు
వీరాభిమన్యు (11), పొట్టిప్లీడరు (2), మనుషులు మారాలి (7), తాసిల్దారుగారి అమ్మాయి (6), సంపూర్ణ రామాయణం (8), జీవన తరంగాలు (2), పుట్టినిల్లు మెట్టినిల్లు (2), అందరూ దొంగలే (3), మంచిమనుషులు (10), జేబుదొంగ (9), సోగ్గాడు (19), మల్లెపూవు (1), కార్తీకదీపం (10), జూదగాడు (5), గోరింటాకు (9), కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (2), పండంటి జీవితం (4), ఇల్లాలు (8), మహారాజు (1), ఖైదీ బాబాయ్ (2), ఇల్లాలు ప్రియురాలు (8), ప్రేమ మూర్తులు (2), దేవత (17), ముందడుగు (17), సర్పయాగం (1), ఏవండీ ఆవిడ వచ్చింది (2)