శ్రీపాద పినాకపాణి
తల్లిదండ్రులు:  కామేశ్వరరావు, జోగమ్మ
స్వస్థలం: శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారం
జననం: 03 వ తేది ఆదివారం, ఆగస్ట్ 1913

రోగాలను , రాగాలను సరిచేసిన సవ్యసాచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాక పాణి గారు 2012 ఆగస్ట్ 3న శత వసంతంలో అడుగిడినారు.. వైద్య, సంగీత రంగాలలో నిష్ణాతులైన పలువురు వీరి శిష్యులే.. గురువులకే గురువు డా. శ్రీ పాద.. శాస్త్రీయ సంగీతం తెలుగునాట అంతంత మాత్రంగా ఉన్న దినాలవి. నాటక పద్యాలలోనో, హరికథలలోనో తప్ప శాస్త్రీయ సంగీతం వినబడని ఆరోజులలో, తమిళ నాట లాగే శాస్త్రీయ సంగీతం తెలుగునాట పరిమళించాలని ఆకాంక్షించారు. ఆ దిశగా ఎందరో సంగీత శిఖామణులను తెలుగు వారికి అందచేశారు.

జననం, బాల్యం, విద్యాబ్యాసం

శ్రీపాద వారు శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో 1913 ఆగస్ట్ 3వ తేదిన కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించారు..రాజమండ్రికి చెందిన లక్ష్మణరావు గారి వద్ద తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు.. ద్వారం వెంకటస్వామి వారి శిష్యరికం చేశారు.. వారు 1939వ సంవత్సరలో లో విశాఖపట్నం ఆంధ్ర వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టా తీసుకున్నారు.1945వ సంవత్సరంలో జనరల్ మెడిసన్లో ఎం.డి. పూర్తి చేసారు.

రాగ సాధన

సంగీతం వింటూనే నొటోషన్స్ రాయగల నైపుణ్యం వీరి కుంది.. పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీ కారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..పాణినీయం, ప్రపత్తి, స్వరరామమ్, అభ్యాసమ్, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు.

బిరుదులు, పురస్కారాలు

వారి ఇతర బిరుదులు సంగీతకళా శిఖామణి, సప్తగిరి సంగీత విద్వాన్ మణి, గానకళాసాగర, కళాప్రపూర్ణ ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు వారు అందుకొన్నారు.. వారి సంగీతాన్ని కేంద్రనాటక అకాడమీ రికార్డ్ చేసి ఆర్కైవ్స్ లో పొందు పరచింది.
సంగీత కళానిధి అవార్డు అందుకున్నారు.
1977 లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు.
1978 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం చే కళాప్రపూర్ణ బిరుదు అందుకున్నారు.
1984 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు తో సత్కరించింది.
2011 లో సంగీత నాటక అకాడమీ ఠాగూర్ ఫెలో గౌరవాన్ని పొందారు.
2012 ,ఆగష్టు 3 న తన 99 వ జన్మదిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే "జ్ఞాన విద్యా వారథి" బిరుదుయివ్వబడినది.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
గౌరవ డాక్టరేట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం చే కళాప్రపూర్ణ బిరుదు 1978
పద్మ భూషణ్ భారత ప్రభుత్వం 1984