సుద్దాల అశోక్ తేజ
తల్లిదండ్రులు:  సుద్దాల హనుమంతు, తల్లి జానకమ్మ
స్వస్థలం: సుద్దాల గ్రామం, గుండాల మండలం నల్గొండ జిల్లా
జననం: 16 వ తేది సోమవారం, మే 1960

సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా కథ మరియు పాటల రచయిత. ఠాగూర్ (2003) చిత్రం లో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు. ఆయన 1960, మే 16 న నల్గొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి సుద్దాల హనుమంతు మరియు తల్లి జానకమ్మ.

తొలి జీవితం

బాల్యం నుంచే ఆయన పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ మెట్‌పల్లి లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు. నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్ కు మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. తనికెళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. తొలుత తండ్రియైన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. కృష్ణవంశీ లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించాడు. ఒసేయ్ రాములమ్మా, నిన్నే పెళ్ళాడతా సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

ప్రసిద్ధి చెందిన పాటలు

  • ఆలి నీకు దండమే, అర్దాంగి నీకు దండమే
  • నేను సైతం - ఠాగూర్
  • నేలమ్మ నేలమ్మ నేలమ్మా..
  • ఒకటే జననం ఒకటే మరణం - భద్రాచలం
  • దేవుడు వరమందిస్తే... నే నిన్నే కోరుకుంటానే
  • నువు యాడికేళ్తే ఆడికోస్త సువర్ణా
  • ఏం సక్కగున్నావో నా సోట్టసేంపలోడా - ఝుమ్మంది నాదం
  • మీసాలు గుచ్చకుండా ‍‍- చందమామ
  • నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ - గోవిందుడు అందరి వాడేలే 

పురస్కారాలు

2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్ సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ అవార్డు. అంతకుముందు శ్రీశ్రీకి (అల్లూరి సీతారామరాజు సినిమాలో "తెలుగు వీర లేవరా" అనే పాటకు), వేటూరి సుందరరామమూర్తికి (మాతృదేవోభవ సినిమాలో "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకు) లభించాయి.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
నేషనల్ ఫిల్మ్ జాతీయ ఉత్తమ గీత రచయిత 2003

వీడియోలు...

సుద్దాల అశోక్ తేజ కుటుంబం

సుద్దాల అశోక్ తేజ పాట

సుద్దాల అశోక్ తేజ సందేశం