వెనపల్లి సురేశ్
స్వస్థలం: వంగూరు గ్రామం

సురేశ్ వెనపల్లి భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన బీజగణితం లో పరిశోధనలు చేశారు. ఆయన ఎమొరీ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు.

జీవిత విశేషాలు

ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని వంగూరు గ్రామంలో జన్మించారు. వంగూరు నందలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 9 వతరగతి వరకు చదువుకున్నారు. ఆయన హైదరాబాదు విశ్వవిద్యాలయం నందు ఎం.ఎస్సీ పూర్తి చేసారు. తదుపరి టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో 1989 లో చేరారు. ఆయన అచట రామన్ పరిమళ అధ్వర్యంలో పి.హె.డి ని 1994 లో పూర్తిచేశారు. ఆయన ఆ తర్వాత హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశారు.

గౌరవ సత్కారాలు

శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని గణిత శాస్త్రం విభాగంలో 2009 లో అందుకున్నారు.
2010 లో హైదరాబాదు (తెలంగాణ రాష్ట్రం) లో జరిగిన "ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేధమెటిక్స్" లో వక్తగా ఆహ్వానింపబడ్డారు.
ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్కా ఫెలోషిప్
ఆంధ్ర ప్రదేశ్ శాస్త్రవేత్త అవార్డు, 2008
బి.ఎం.బిర్లా సైన్స్ ప్రైస్,2004
INSA మెడల్ ఆఫ్ యంగ్ సైంటిస్ట్స్, 1997