సూరి భగవంతం
స్వస్థలం: కృష్ణా జిల్లా ఆగిరిపల్లి
జననం: 14 వ తేది గురువారం, అక్టోబర్ 1909
మరణం: 06 వ తేది సోమవారం, ఫిబ్రవరి 1989

సూరి భగవంతం  ప్రముఖ శాస్త్రవేత్త. దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు.

బాల్యం-విద్యాభ్యాసం

వీరు కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో అక్టోబరు 14, 1909 న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం హైదరాబాదు నిజాం కళాశాలలో డిగ్రీ (బి.ఎస్సీ) చదువు పూర్తిచేసి, మద్రాసు యూనివర్సిటీ నుండి బి.ఎస్.సి(భౌతిక శాస్త్రము) డిగ్రీని ప్రధమ శ్రేణిలో ప్రధముడుగా అందుకున్నారు. ఈ సందర్భంగా అనేక మెడల్స్ ను అందుకున్న విధ్యార్థిగా కలకత్తాలో సర్ సి.వి.రామన్ దగ్గర రీసెర్చ్ స్కాలర్ గా చేరారు. ఈయన తన మేథో సంపత్తితో, శాస్గ్త్రీయ దృక్పథంతో, ఆలోచనా సరళితో, ప్రయోగ శీలతతో సి.వి.రామన్ అభిమానాన్ని సూచగొని ప్రియ శిష్యులయ్యారు. అక్కడే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్సీ. పట్టాను సంపాదించారు.

శాస్త్ర రచనలు

1961 లో క్రిస్టల్ సిమెట్రీ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే బృహత్తర గ్రంథ రచన చేసి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. కమిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్ అధ్యక్షులుగా సి.వి.రామన్ పరిశోధించిన రామన్ ఎఫెక్టు అంశం మీద ప్రామాణిక పరిశోధనలు చేసిన అద్వితీయ శాస్త్రవేత్తగా కీర్తి గడించారు. రామన్ ఎఫెక్ట్, క్రిష్టల్ స్ట్రక్చర్ మొదలగు అంశాల మీద అవిశ్రాంత పరిశోధనలు జరిపి గ్రంథరచనలు చేశారు.

ఈయన 300 పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. పైన తెలిపిన గ్రంథమే కాక గ్రూప్ థీరీ, రామన్ ఎఫెక్టు అనే రెండు ఉత్తమ గ్రంథాలను కూడా చెశారు. ఈ మూడు గ్రంథములు ప్రామాణిక గ్రంథాలుగా అంతర్జాతీయ ఖ్యాతిని పొంది, అనేక భాషలలోకి అనువదించటం జరిగింది. జాతీయ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సైంటిఫిక్, ప్రొఫెషనల్ సంస్థలు అనేకంలో ఈయన అలెక్టెడ్ ఫెలో గా ఉన్నారు. పలు యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.