తనికెళ్ళ భరణి
స్వస్థలం: జగన్నాధపురం, పోడూరు, పశ్చిమ గోదావరి జిల్లా
జననం: 14 వ తేది శనివారం, జులై 1956

తనికెళ్ళ భరణి (జననం: జులై 14, 1956) తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకలాకళా కోవిదుడు. ఇతనికి ప్రముఖ దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు.

చలనచిత్రరంగ ప్రవేశం

తనికెళ్ళ భరణి వ్రాసిన " చల్ చల్ గుర్రం " నాటకం చూసిన రామరాజు హనుమంతరావు ఆయనకు " కంచు కవచం " చిత్రానికి వచనకర్తగా అవకాశం ఇచ్చాడు. తరువాత " లేడీస్ టైలర్" చిత్రానికి వచనకర్తగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత " శివ " చిత్రంలో నటుడిగా అవకాశం అలాగే పేరూ వచ్చింది. దాదాపు 60 చిత్రాలకు వచనకర్తగా పనిచేసే అవకాశం లభించింది. ఆయన తెలగాణా యాసలో వచనం వ్రాయడంలో సిద్ధహస్థుడు. " మొండి మొగుడు - పెంకిపెళ్ళాం " చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలగాణాయాసలో వచనం వ్రాసి విజయం సాధించి తెలంగాణా యాసకు కావ్యగౌరవం కలిగించాడు.

నటుడిగా

తనికెళ్ళభరణి చలనచిత్రనటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు మరియు పరదేశి చిత్రాలలో భరణి ఉదాత్తమైన నటన ప్రదర్శించాడు. కామెడీ విలన్, విలన్ మరియు ఉదాత్తమైన వైవిద్యమైన పాత్రదారణతో భరణి ప్రజాదరణ పొందిననటులలో ఒకడయ్యాడు. ఆయన దాదాపు 200 పైచిలుకు చిత్రాలలో నటించాడు.

పాక్షిక చిత్ర సమాహారం

దర్శకుడిగా
మిథునం (2012)

నటించిన చిత్రాలు
కార్తికేయ (సినిమా) (2014), రారా...కృష్ణయ్య (2014), పాండవులు పాండవులు తుమ్మెద (2014), ఢి ఫర్ దోపిడి (2013), కలెక్టర్ గారి భార్య (2010), బావ (సినిమా) (2010), రక్తచరిత్ర - రామ్మూర్తి - 2010, మిస్సమ్మ (2003 సినిమా), మనసున్న మారాజు (2000), సర్దుకుపోదాం రండి (2000), శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, స్వర కల్పన, చెట్టు కింద ప్లీడర్, శివ, జగదేక వీరుడు అతిలోక సుందరి, సీతారామయ్య గారి మనవరాలు, అప్పుల అప్పారావు, యమలీల, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, ఇంద్ర, చిత్రం

నాటకాలు రచయితగా
కొక్కొరోకో, గార్థభాండం, గోగ్రహణం, చల్ చల్ గుర్రం, జంబూద్వీపం .

సినీ రచనలు
శీను వాసంతి లక్ష్మి (2004), గాయం (1993), చెట్టుకింద ప్లీడర్ (1989), స్వరకల్పన (1989), వారసుడొచ్చాడు (1988), శ్రీకనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూపు (1987), అన్వేషణ (1985), లేడీస్ టైలర్ (1985)

పురస్కారాలు
సముద్రం సినిమా కోసం ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం

రచనలు
నక్షత్ర దర్శనం
పరికిణీ
ఎందరో మహానుభావులు
మాత్రలు
శబ్బాష్‌రా శంకరా