త్రిపురనేని గోపీచంద్
స్వస్థలం: కృష్ణా జిల్లా అంగలూరు గ్రామము
జననం: 08 వ తేది గురువారం, సెప్టెంబర్ 1910
మరణం: 02 వ తేది శుక్రవారం, నవంబర్ 1962

త్రిపురనేని గోపీచంద్ సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించారు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించారు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువు గా,తత్వవేత్త గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.

గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

రచనలు

నవలలు
అసమర్థుని జీవయాత్ర
గడియపడని తలుపులు
చీకటి గదులు
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
ప్రేమోపహతుల
పరివర్తన
యమపాశం
శిధిలాలయం

వాస్తవిక రచనలు
తత్వవేత్తలు
పోస్టు చేయని ఉత్తరాలు
మాకూ ఉన్నాయి సొగతాలు

తెలుగు సినిమాలు
చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత)
ధర్మదేవత (1952) (మాటల రచయిత)
ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత మరియు దర్శకుడు)
పేరంటాలు (1951) (దర్శకుడు)
లక్ష్మమ్మ (1950) (దర్శకుడు)
గృహప్రవేశం (1946) (కథా రచయిత)
రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
కేంద్ర సాహిత్య అకాడమి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు 1963