ఉపద్రష్ట సునీత
తల్లిదండ్రులు:  నరసింహారావు, సుమతి
స్వస్థలం: గుంటూరు
జననం: 10 వ తేది బుధవారం, మే 1978

సునీత సుప్రసిద్ధ నేపథ్య గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి. ఈమె పూర్తి పేరు సునీత ఉపద్రష్ట . ఈమె 8 సంవత్సరాల కాలంలో సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది.

జీవిత విశేషాలు

సునీత తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఉపద్రష్ట నరసింహారావు మరియు సుమతి (ఇంటిపేరు హరి) దంపతులకు జన్మించింది.

విద్యాభ్యాసం

ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు గుంటూరు లోను, మరికొంత కాలం విజయవాడలోను చేసింది.
చిన్ననాటి నుండే సంగీతాన్ని అభిమానించి, ప్రేమించి విజయవాడ నందు సంగీత ద్రష్ట అయిన పెమ్మరాజు సూర్యారావు వద్ద కర్ణాటక సంగీతంలోను మరియు కలగా కృష్ణమోహన్ గారి దగ్గర లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు శిక్షణ పొందినది. గురువుగారితో పాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనేది.
ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపధ్యగాయనిగా ప్రవేశించింది. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే పాట పాడింది. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. తరువాత ఈమె తెలుగు, కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడింది.

డబ్బింగ్ కళాకారిణి
ఉపద్రష్ట సునీత తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియ, జ్యోతిక, ఛార్మి, నయనతార , సదా, త్రిష, భూమిక, మీరా జాస్మిన్, లైలా, స్నేహ, సోనాలి బింద్రె, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్ మొదలైనటువంటి వివిధ కళాకారులు కోసం గాత్రదానం (వాయిస్ ఓవర్) ఇచ్చారు.

డబ్బింగ్ కళాకారిణిగా ప్రఖ్యాతి పొందిన సినిమాలు
ఠాగూర్ (జ్యోతిక కోసం)
చూడాలని ఉంది (సౌందర్య కోసం)
మనసంతా నువ్వే (తనూరాయ్ కోసం)
జయం (సదా కోసం)
ఇంద్ర (సోనాలి బింద్రే కోసం)
ఒకరికి ఒకరు (ఆర్తి చాబ్రియా కోసం)
నేనున్నాను (శ్రియ కోసం)
ఆనంద్ (సినిమా) (కమలినీ ముఖర్జీ కోసం)
మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి (లైలాకోసం)
శ్రీ రామదాసు (కోసం స్నేహ)
గోదావరి (కమలినీ ముఖర్జీ కోసం)
హ్యాపీ డేస్ (తమన్నా కోసం)
కంత్రి (సినిమా) (హన్సిక కోసం)
సింహ (సినిమా) (నయనతార కోసం)
శ్రీరామ రాజ్యం (నయనతార కోసం)

కొన్ని సినిమా పాటలు
1996 : ఊహా
2007 : గొడవ, చిరుత
2008 : పాండురంగడు : కోసల దేశపు కాంతలతో (పాట), గోరింటాకు, గమ్యం, కృష్ణార్జున : యమ రంజుమీద ఉంది పుంజు (పాట)
2009 : రైడ్, బోణీ, ఆ ఇంట్లో : హృదయ వేదన తెలుపనా ఈ క్షణం
2014 : నేరము శిక్ష

అవార్డులు

జాతీయ అవార్డులు
విద్యార్థినిగా, ఉపద్రష్ట సునీత సాంస్కృతిక వ్యవహారాలు, మంత్రిత్వ (ప్రభుత్వ విభాగం) శాఖ, ఢిల్లీ వారి వద్ద నుండి, జానపద పాటలు కోసం ఢిల్లీలో మొదటి జాతీయ అవార్డు అందుకొంది మరియు ఆమె 8 సంవత్సరాల వయస్సులో ఒక స్కాలర్‌షిప్ కూడా పొందింది.
1994: 15 సంవత్సరాల వయస్సులో 1994 సంవత్సరములో లలిత సంగీతం విభాగంలో ఆల్ ఇండియా రేడియో (All India Radio) నుండి నేషనల్ అవార్డు.

నంది పురస్కారాలు
1999 : టెలివిజన్ చిత్రం అంతరంగాలు కోసం ఉత్తమ నేపథ్య గాయనిగా 1999 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు.
2002 : నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - జయం
2003 : నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు - అతడే ఒక సైన్యం - నాపాట తేటతెలుగు పాట అనే పాట.
2004 : నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - ఆనంద్ (కమలినీ ముఖర్జీ కి గాత్ర దానం చేసినందుకు)
2005 : నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - “పోతే పోనీ”.

ఇతర అవార్డులు
1999 : ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా 1999 సం.లో వంశీ బర్కిలీ అవార్డు.
2000 : భరత ముని అవార్డు. (2000 సం.లో)
2000 : ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా 2000 సం.లో వార్త వాసవి అవార్డు.

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
నంది టెలివిజన్ చిత్రం అంతరంగాలు కోసం ఉత్తమ నేపథ్య గాయనిగా 1999
నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - జయం 2002
నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు - అతడే ఒక సైన్యం - నాపాట తేటతెలుగు పాట అనే పాట. 2003
నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - ఆనంద్ (కమలినీ ముఖర్జీ కి గాత్ర దానం చేసినందుకు) 2004
నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - “పోతే పోనీ”. 2005