శ్రీకాంత్‌కు రూ.5 లక్షల నజరానా ప్రకటించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్)
17 వ తేది సోమవారం, ఆగస్ట్ 2015

స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్‌ను సాధించిన భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా సోమవారం రూ. 5 లక్షల అవార్డుని ప్రకటించారు.

 

ప్రపంచంలో 4వ ర్యాంకులో ఉన్న కిదాంబి శ్రీకాంత్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ మాట్లాడుతూ ‘స్విట్జర్లాండ్‌లో బసేల్‌లో జరిగిన బ్యాడ్మింటన్ పోరులో విజయం సాధించిన శ్రీకాంత్‌కు నా అభినందనలు. ఈ టైటిల్‌ను సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డును సృష్టించావు. నీవు భవిష్యత్‌లో మరిన్ని రికార్డ్సు సాధించి భారత్‌కు పేరును తేవాలని ఆకాంక్షిస్తున్నానని' అని పేర్కొన్నారు.