వందేమాతరం శ్రీనివాస్

వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ది చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడు. టి.కృష్ణ వందేమాతరం సినిమాలో 'వందేమాతరగీతం వరసమారుతున్నది' అనే పాట తో నేపధ్యగాయకుడిగా పరిచయమయ్యాడు. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యదికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. అమ్ములు అనే చిత్రంలో హీరో పాత్రలో నటించాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, 'దేవుళ్ళు' చిత్రంలో భక్తి పరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చెయడంలో ముఖ్య భూమిక పోషించారు.

సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు
ఎర్ర సైన్యం, దండోరా, లాల్ సలాం, అడవి దివిటీలు, ఎర్రోడు, తెలుగోడు, అరణ్యం, ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మా, రౌడీ దర్బార్, ఎన్ కౌంటర్, పెళ్లిపందిరి, స్వయంవరం, భారతరత్న, అడవి చుక్క, మిస్సమ్మ (2003)