యార్లగడ్డ నాయుడమ్మ
తల్లిదండ్రులు:  సుబ్బారావు, రంగమ్మ
జననం: 01 వ తేది ఆదివారం, జూన్ 1947

యార్లగడ్డ నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచిన శిశు వైద్యుడు.ప్రకాశం జిల్లా,కారంచేడు గ్రామములో జన్మించాడు. గుంటూరు వైద్యశాలలో పనిచేస్తునాడు. అతి కష్టమైన శస్త్ర చికిత్సలు చేయుటలో నిష్ణాతుడు. జన్మతోనే వివిధ రీతులలో అతుక్కుని పుట్టిన మూడు కవలల జంటలను విజయవంతముగా శస్త్ర చికిత్స చేసి వేరు చేశాడు.

చదువు

నాయుడమ్మ యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు 1947 జూన్ 1న జన్మించాడు. 1970లో గుంటూరు వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందాడు. 1974 లో రోహతక్ వైద్య కళాశాల నుండి శస్త్రచికిత్సా శాస్త్రములో యం.యస్ పట్టా పొందాడు. పిమ్మట ఢిల్లీ లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ నుండి బాల్యశస్త్రచికిత్స లో యం.సి.హెచ్ పట్టభద్రుడయ్యాడు. గుంటూరు వైద్య కళాశాల లో ఉప ప్రిన్సిపాల్ గా పని చేశాడు.

పురస్కారాలు

డా. తుమ్మల రామబ్రహ్మం పురస్కారము-2002- గుంటూరు వైద్య కళాశాల పాత విద్యార్ధుల సంఘం-అమెరికా
డా. వుళ్ళక్కి స్వర్ణ పురస్కారము-2003
డా. డి. జె. రెడ్డి పురస్కారము-2003
ప్రభావతి-వై.యస్. ప్రసాద్ స్మారక పురస్కారము- 2003
విశిష్ఠ పురస్కారము- రామినేని సంస్థానము , అమెరికా - 2004
చోడవరపు ధర్మ సంస్థ పురస్కారము - 2004
విశిష్ఠ వ్యక్తి పురస్కారము - 2005- సిద్ధార్ఠ కళాపీఠము, విజయవాడ.
విశ్వ తెలుగు సంఘటన పురస్కారము- 2005
రోటరీ వృత్తి నిష్ణాత పురస్కారము - 2006
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము - గౌరవ డాక్టరేట్ పురస్కారము - 2008

పురస్కారాలు
అవార్డువివరములుసంవత్సరము
గౌరవ డాక్టరేట్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము - గౌరవ డాక్టరేట్ 2008