యలవర్తి నాయుడమ్మ
స్వస్థలం: గుంటూరు జిల్లా యలవర్రు గ్రామము
జననం: 10 వ తేది ఆదివారం, సెప్టెంబర్ 1922

యలవర్తి నాయుడమ్మ (1922 - 1985) ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రసాయన శాస్త్రవేత్త. చర్మ పరిశోధనలలో విశేష కృషి చేసిన మేధావి.

బాల్యం, విద్యాభ్యాసం

గుంటూరు జిల్లా యలవర్రు గ్రామములో ఒక వ్యవసాయ కుటుంబములో సెప్టెంబరు 10, 1922 న జన్మించాడు. గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన పిమ్మట గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. 1943 లో కాశీ హిందూ విశ్వవిద్యాలయములో రసాయన టెక్నాలజిలో ఉన్నతవిద్యనభ్యసించి మద్రాసు చర్మ టెక్నాలజీ సంస్థలో ప్రత్యేక విద్య గరపి అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టరు అయ్యాడు. 1958 నుండి 1971 వరకు సుదీర్ఘకాలము డైరెక్టరుగా ఉన్నాడు. తన ఆధ్వర్యములో చర్మపరిశోధనా సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాడు. అమెరికా లోని లీ హై యూనివర్సిటీ లో అంతర్జాతీయ చర్మ శుద్ధి అంశం మీద డాక్టరేట్ (పి.హె.డి) డిగ్రీ పొందారు.

పరిశోధనలు

అమెరికా లోని చర్మ పరిశుభ్రం చెసే పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అధ్భుత విజయాలను సాధించారు. 1943-45 నడుమ కాలంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ(మద్రాసు) లో శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలు మేళవించగా, అమెరికా లో చేసిన పరిశోధనా కృషి ఫలవంతమైనది. తిరిగి మాతృదేశానికి వచ్చి, 1951 లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనివర్సిటీ లో శాస్త్రవేత్తగా చేరారు. ఎన్నో నూతన లాభదాయక ప్రణాళికలను రూపొందించి చర్మకార పరిశ్రమను అభివృద్ధి చేశారు. కేంద్ర చర్మ పరిశోధనా సంస్థనూ సాటిలేని పరిశోధనా సంస్థగా రూపొందించారు. ఈ సంస్థ జాతీయ స్థాయికి ఎదిగి పారిశ్రామిక అభివృద్ధి లోనూ, గ్రామీణ అభివృద్ధిలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. 1956 లో డైరక్టర్ గా పదోన్నతి పొందారు.

సినీ నిర్మాతగా శాస్త్రవేత్త

యలవర్తి నాయుడమ్మ ఒక తెలుగు సినిమా కు నిర్మాతగా వ్యవహరించారు. ఎన్.టి.రామారావు హీరోగా, ఎన్.డి.లాల్ దర్శకత్వంలో రాజపుత్ర రహస్యం సినిమాను నిర్మించారు. నాయుడమ్మ శాస్త్రవేత్త కావడంతో ఈ జానపద చిత్రం లో కూడా ఓ వైజ్ఞానిక విషయాన్ని ప్రస్తావించారు. ఓ మనిషి ఏ ప్రాంతంలో పెరిగితే ఆ భాషనే మాట్లాడతాడు. అనే సిద్ధాంతాన్న్ని అనుసరించి ఇందులో హీరో చిన్న తనంలోనే అడవిలో జంతువుల సహవాసంలో పెరగడంతో కేవలం సైగలే చేస్తూ ఉంటాడు.